S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అచ్చం కలాంలా!

చిత్తూరు, జూలై 29 : చిత్తూరు ఎంపి డాక్టర్ ఎన్ శివప్రసాద్ మాజీ రాష్టప్రతి ఎపిజె అబ్దుల్ కలాం వేషధారణలో అలరించారు. చిత్తూరు మార్కెట్‌యార్డులో 67వ వనమహోత్సవం జరిగింది.అటవీశాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రారంభించిన వనమహోత్సవం కార్యక్రమానికి ఎంపి శివప్రసాద్ కలాం వేషధారణలో వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ముఖ్యంగా విద్యార్థుల వద్ద వెళ్లి కాసేపు ముచ్చటించారు. అకస్మాత్తుగా అబ్దుల్ కలామ్ వేషధారణలో వచ్చిన ఎంపిని చూసి విద్యార్థులు విస్తుపోయారు. కాసేపటికి తేరుకుని ఎంపితో కరచాలనాలు చేయడమే గాకుండా ముఖాముఖి సంభాషించారు. ఎంపి మాట్లాడుతూ కలలు కనండి, వాటిని వాటిని నెరవేర్చుకోండి అనే కలామ్ నినాదాన్ని మొక్కల పెంపకానికి అన్వయించేందుకే తాను ఆయన వేషధారణలో వచ్చానని చెప్పారు.

కలాం వేషధారణలో
చిత్తూరు ఎంపీ శివప్రసాద్