S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కృష్ణా పుష్కరాలకు 1100 బస్సులు

మిర్యాలగూడ టౌన్, జూలై 29: ఆగస్టు 12నుండి జరిగే కృష్ణా పుష్కరాలకు తెలంగాణ లోని పది జిల్లాల నుండి 1100 బస్సులను నడపనున్నట్టు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి.వేణు తెలిపారు. శుక్రవారం స్థానిక ఆర్టీసి డిపో కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణాలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో ఐదు ముఖ్యమైన పుష్కర ఘాట్లు, అదే విధంగా విజయవాడ ఘాట్లకు హైద్రాబాద్ నుండి 100 ఎసి బస్సులను ప్రతి రోజు నడుపుతామని చెప్పారు. నాగార్జునసాగర్, వాడపల్లి, మట్టపల్లి, బీచుపల్లి, రంగంపల్లి, శ్రీశైలం, సోమశిలలకు అధికంగా బస్సులు ఉంటాయని ఆయన అన్నారు. అన్ని రకాల బస్సులను నడుపుతామని ఆయన అన్నారు. ఘాట్ల వరకు బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. బస్సులకు ఎలాంటి మరమ్మతులు వచ్చినా వెంటనే సరిచేసేందుకు సంచార వాహనాలుంటాయని ఆయన అన్నారు. ముఖ్యమైన ఘాట్లలో రీజినల్ మేనేజర్, సీనియర్ ఆఫీసర్లను పర్యవేక్షణకు నియమిస్తున్నట్టు ఆయన తెలిపారు. వీరు కాక 80 మంది సెక్యురిటీ సిబ్బంది కూడా పని చేస్తారని ఆయన అన్నారు. కమాండ్ సెంటర్‌లను ఏర్పాటు చేసే ఆలోచన ఉందని ఆయన అన్నారు. కండిషన్‌లో ఉన్న బస్సులను ఏర్పాటు చేస్తున్నామని, అదేవిధంగా 20 కొత్త బస్సులను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. ఘాట్ల బస్సు స్టాప్‌ల వద్ద వాటర్‌ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రయాణికులకు ప్రథమ చికిత్స అందించే ఏర్పాట్లు కూడా చేస్తున్నామన్నారు. ఆయన వెంట రీజినల్ మేనేజర్ బి.కృష్ణహరి, డిపో మేనేజర్ బి.సుధాకర్‌రావు, ఎఫ్‌ఎం చంద్రశేఖర్‌లున్నారు.