S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య

హైదరాబాద్: ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఘట్‌కేసర్ మండలం అంకుషాపూర్ వద్ద శనివారం తెల్లవారు జామున వెలుగు చూసింది. ఆదిలాబాద్ జిల్లాలో హౌసింగ్ శాఖలో డి.ఇగా పనిచేస్తున్న సత్యనారాయణ (53) మృతదేహాన్ని పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఓ కారులో కనుగొన్నారు. సమీపంలోనే రైలు పట్టాలపై సత్యనారాయణ భార్య మీరాబాయి (45) , కుమార్తెలు స్వాతి (31), నీలిమ (29), కుమారుడు శివరామకృష్ణ (22) మృతదేహాలను పోలీసులు గుర్తించారు. సత్యనారాయణ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు, ఆర్థిక సమస్యల వల్లే వీరంతా ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులకు ప్రాథమిక సమచారం లభించింది. సత్యనారాయణ పురుగుమందు తాగి కారులోనే ఆత్మహత్య చేసుకున్నాడని, మిగతా నలుగురు రైలుకింద పడి మరణించారని పోలీసులు చెబుతున్నారు.