S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ముగింపు బాగుంది

మైండ్ బ్లాక్ అవుట్ అయినప్పుడు తనేం చేస్తున్నాడో తనకే తెలియక నేరం చేస్తానన్న భయంతో ఒకడు తనని జైల్లో పెట్టమని పోలీసుల్ని కోరడంతో ప్రారంభమైన కథ అనేక మలుపులు తిరిగి నేర నిర్థారణతో ముగిసిన విధం ఆకట్టుకొంది. ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లేందుకు కొందరు ఎంచుకున్న ప్రయాణ సాధనాలు అబ్బురపరిచాయి. ధరలు పెరుగుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతారు కాని కొందరు పత్రిక ధర పెంచమంటూ విజ్ఞప్తి చేయడం, అభిమానుల కోరిక మేరకు పెంచుతున్నామంటూ కొన్ని పత్రికలు వెల పెంచడం పరిపాటి అయింది.
-ఆర్.మరుదకాశి (కరప)

ఉత్తేజం కలిగించే అనుభవాలు
గోపాలంగారి ‘లోకాభిరామం’ మరో ప్రపంచంలో తన పరిచయస్తులను, వారితో అనుభవాలను చదివిన ప్రతీవారికి తమ జీవితంలోనూ అనేక అనుభవాల దొంతరలను తట్టి లేపాయి. ఆ జ్ఞాపకాలలో మధురమైనవీ, కొన్ని చేదువి కూడా ఉంటాయి. మనలను మానసికంగా ఉత్తేజపరిచే పరిచయాలు గుర్తు చేసుకున్నప్పుడల్లా ఆనందం ఉప్పొంగి జీవితం మరింత ముందుకు సాగుతుందనే విశ్వాసం కలుగుతుంది. కొందరి అనుభవాలు మనకు వివరించినా, తెలిసినా, వాటిని మస్తిష్కంలో నింపితే అవి కూడా మనలాంటి మనసుగల వారితో పంచుకోవాలనిపిస్తుంది. చలంగారి శిష్యరికం, దివాకర్ల వేంకటావధానిగారితో గల స్కూలు అనుభవాలు మా మావగారు చెబుతూండేవారు. వాటినే మా పిల్లలకు వివరిస్తూంటాను. వారి ద్వారా వారి పిల్లలకు చేరితే అంతకన్నా ఆనందం ఏముంటుంది?
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)

విశ్రాంతి పెరిగితే ఇబ్బందే..
ఇలా స్విచ్ వేస్తే అలా పనులు చేసేసే గృహోపకరణాలతో జీవితంలో శ్రమ పడనక్కర్లేదు. అలాంటి ఉపకరణాలున్న ఇంటిని స్మార్ట్ హోం అనడం కద్దు. అయితే శరీరానికీ, మెదడుకీ విశ్రాంతి ఎక్కువైతే దయ్యాలకు నిలయాలు అయ్యే ప్రమాదం ఉంది. జనాభా దినోత్సవం సందర్భంగా జనాభా పెరిగితే సమస్యలెంత జటిలంగా ఉంటాయో బాగా వివరించారు. సమస్యలు చెయ్యి దాటిపోక ముందే నివారణ పథకాలతో ప్రభుత్వాలు సంసిద్ధంగా ఉండాలి. చిన్నచిన్న అబద్ధాల్ని చెద పురుగులతో పోల్చిన ‘స్ఫూర్తి’ కథలో నీతి బాగుంది.
-బి.చంద్రిక (రాజేంద్రనగర్)

తీయనైన చక్కెర పురాణం
కథలు, కవితలు చదవడం, ఫొటోగ్రఫీ, వస్తు సేకరణ లాంటి హాబీలపై కొంత పెట్టుబడి పెడితే ఎప్పుడో ఒకప్పుడు ఆ హాబీ విలువ కట్టలేని సంతోషాన్నిస్తుందన్న ఓ చిన్న మాట ఒక సత్యాన్ని చెప్పింది. తీపి అనే రుచి వెనుక బోలెడంత రసాయన శాస్త్రం ఉందంటూ గోపాలంగారు చెప్పిన చక్కెర పురాణం బహు తీపిగా ఉండి హృదయాల్ని నింపింది. అంతర్గత, బహిర్గత ప్రతిఫలాలు, ప్రేరణలు, తంత్రాలు గురించి బహు చక్కగా వివరించారు సర్వేశ్వరశర్మగారు. డాల్మేషియన్ కుక్కల శరీరం మీదనే కాక లోపలా మచ్చలుంటాయని, వేల్ షార్క్ నోటీలో 36 వరుసల్లో 4వేల పళ్లుంటాయని తెలిసి ‘హా’శ్చర్యపోయాం!
-ఎ.శాంతిసమీర (వాకలపూడి)

చక్కెర బదులుగా ఆకులు..
గత ఆదివారం అనుబంధంలో ‘లోకాభిరామం’లో గోపాలంగారు చక్కెర వ్యాధి గురించి చెప్తూ, చక్కెర కంటె తియ్యగా ఉండే మొక్కలు ఉన్నాయని రాశారు. ఆ మొక్కల ఆకులు చాలా తియ్యగా ఉంటాయని, కొన్ని మొక్కల పేర్లు కూడా రాశారు. వీటి గురించి వినడం తప్పించి ఆయనకు ఏమీ తెలియదని కూడా రాశారు. ఈ నేచురల్ షుగర్స్ మొక్కల్లో నాకు తెలిసిన ఒకే ఒక్క మొక్క పేరు ‘స్టీవియా’ ఈ మొక్క మా ఇంట్లో ఉంది. దీని ఆకులు చాలా తీయగా ఉంటాయి. ఈ మొక్కలు ఎర్రగడ్డలో దొరుకుతాయి. ఈ మొక్కల ఆకుల నుండి తయారుచేసిన ‘స్టీవియా పౌడర్’ కేవలం ‘రత్నదీప్’ సూపర్ మార్కెట్‌లో మాత్రమే దొరుకుతుంది. చక్కెర బదులుగా దీనిని అన్నిట్లో వాడుకోవచ్చు. చక్కెర టేస్ట్ రాదు కాని బాగానే ఉంటుంది. చక్కెర వ్యాధి కలవారికి ఇదొక వరం.
-సుధ (ఈస్ట్ మారేడ్‌పల్లి, సికిందరాబాద్)

మనోరంజకం పుష్పవిలాసం
భూమి పువ్వుల ద్వారా నవ్వుతుంది. సూర్యునిలా వెలుగుతుంది. నవ్వనిద్దాం వెలగనిద్దాం అంటూ పుష్పవిలాసం గురించి ‘సండే గీత’లో మనోరంజకంగా చెప్పారు. బావుంది. ఔత్సాహిక మత్స్యకన్య, పెదవుల్ని కాన్వాస్‌గా చేసుకొని బొమ్మలు చిత్రీకరించుకున్న అమ్మాయి గురించి చదివి అవాక్కయ్యాం. ట్రంప్, హిల్లరీల్లో ఎవరు గెలిచినా గద్దె మీద కూర్చున్నాక చేసేదొకటేనన్న మీ సమాధానం భేషుగ్గా ఉంది. ప్రచారంలో భావావేశాలు, గద్దె మీద కూర్చున్నాక చట్టాలు పని చేస్తాయి మరి! వాళ్లిద్దరే కాదు. ప్రపంచంలో నేతలందరికీ వర్తించే సత్యమిది.
-ఎన్.గిరిధర్ (కాకినాడ)

మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు bhoomisunday@deccanmail.comకు పంపించవచ్చు.