త్వరలో నాన్న.. నేను.. వర్ష
Published Saturday, 30 July 2016ఆదర్శ్‌బాబు, పావని హీరో హీరోయిన్లుగా శ్రీ ఓం డి క్రియేషన్స్ పతాకంపై అజ్మేర చందు దర్శకత్వంలో ఎఎస్ రావు నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నాన్న.. నేను.. వర్ష’. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అజ్మేర చందు చిత్ర విశేషాలను తెలిపారు. కథకు సరైన న్యాయం జరగాలనే సంకల్పంతో కొత్త హీరో ఆదర్శ్‌బాబు పరిచయం చేస్తున్నామని, అతను ఎంతో అనుభవమున్న ఆర్టిస్టులా నటించాడు. మన పక్కింటి అబ్బాయిలా ఈ చిత్రంలో కనిపిస్తాడు. డాన్స్, ఫైట్స్, డైలాగ్స్ విషయంలో మంచి ప్రతిభ కనబరుస్తున్నాడు. హీరో ఆదర్శ్‌బాబు 12 గెటప్స్‌లో కనిపిస్తాడు. హీరోయిన్ పావనితో పాటు మిగతా నటీనటులు బాగా నటించారు. అన్ని వాణిజ్య హంగులు వున్న యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.’ అని తెలిపారు. ఈ చిత్రంలో ఆదర్శ్‌బాబు, పావని, బస్టాప్ కోటేశ్వరరావు, చలాకీ చంటి, స్నేహ, హారిక, గంగూభాయ్, దిలీప్, రాము, శివ, శోభ, శ్రావణ్, రఘు, మంగూలాల్, సమీర, అక్షయ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు:విశ్వత్చందు, దాస్, ఆదిత్య, లక్ష్మణ్, సంగీతం:డేవిడ్, కెమెరా:డి.విజయకుమార్, ఎడిటింగ్:అనిల్‌రాజు, నిర్మాత:ఎఎస్ రావు, రచన, దర్శకత్వం:అజ్మేర చందు.