S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అవసరమైతే పిడి చట్టం

హైదరాబాద్, జూలై 30: ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీపై డిజిపి అనురాగ్ శర్మ సిఎం కెసిఆర్‌ను శనివారం కలిసి పరిస్థితి వివరించారు. శుక్రవారం జరిగిన సుదీర్ఘ చర్చల్లో ఎంసెట్‌ను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ ఆవిర్భావం తరువాత నిర్వహించిన ఎంసెట్ ప్రశ్నాపత్రాలు లీక్ కావడాన్ని ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చగా భావిస్తున్నారు. లీకేజీలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని నిర్ణయించారు. లీకేజీ సూత్రధారులపై పిడి చట్టం ఉపయోగించడానికి ఉన్న అవకాశాలను సిఎంకు డిజిపి వివరించారు. సోమవారం ముగ్గురు లీకు వీరులను అరెస్ట్ చేయడం, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేయడంపైనా సమావేశంలో చర్చ సాగింది. ఇదిలావుంటే, టి.ఎమ్సెట్-2 ప్రశ్నాపత్రం లీకేజి కేసులో ప్రధాన సూత్రధారి రాజగోపాల్ రెడ్డి, ఇద్దరు బ్రోకర్లు అరిగి వెంకట రమణయ్య అలియాస్ వెంకట రమణ, బండారు రవీంద్ర అలియాస్ రవిని సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కేసులో ఇంతవరకు అరెస్టయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. కేసులో కీలక సూత్రధారి రాజ్‌గోపాల్ రెడ్డిని బెంగళూరులోని ఆయన స్వగృహంలో అరెస్టు చేసినట్టు సిఐడి తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్నాటకలో ఐదుసార్లు మెడికల్ ప్రవేశపరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజి కేసులో రాజ్‌గోపాల్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే అరెస్టయిన విష్ణ్ధుర్ సాయంతో 14మందిని, విజయవాడకు చెందిన జ్యోతి బాబు సాయంతో మరో ఆరుగురు విద్యార్థులను రాజ్‌గోపాల్‌రెడ్డి బెంగళూరుకు తరలించి శిక్షణ ఇప్పించాడని అంటున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన బ్రోకర్ వెంకటరమణ ప్రస్తుతం దిల్‌సుఖ్‌నగర్‌లో రెసోనెన్స్ మెడికల్ అకాడెమీ నిర్వహిస్తున్నాడు. అకాడమిలో మెస్ ఇన్‌చార్జిగా పనిచస్తున్న బండారు రవీంద్రనూ పోలీసులు అరెస్టు చేశారు. కేసులో మిగిలిన నిందితులనూ అరెస్టు చేసేందుకు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు సిఐడి 9 బృందాలను పంపింది. సిఐడి వివరాల ప్రకారం రాజ్‌గోపాల్ రెడ్డి బెంగళూరులో ఉషా ఎడ్యుకేషన్ అకాడెమీ నిర్వహిస్తున్నాడు. ఢిల్లీలోని కపూర్ ప్రింటర్స్ నుంచి ఎమ్సెట్-2 ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు సిఐడి ఆధారాలు సంపాదించింది. కేసులో కీలకమైన బ్రోకర్లు ఖలీల్, ఇక్బాల్, నౌషన్, గుడ్డూ పరారీలో ఉన్నారు.