మంటల్లో ఎయిర్ బెలూన్
Published Sunday, 31 July 2016హోస్టన్, జూలై 30: అమెరికాలోని మధ్య టెక్సాస్‌లో ఎయిర్ బెలూన్ మంటల్లో చిక్కుకోవటంతో 16మంది మరణించారు. లోఖార్ట్ సమీపంలో 16మందితో ప్రయాణిస్తున్న ఎయిర్ బెలూన్‌కు అకస్మికంగా మంటలు వ్యాపించి పొలాల్లో పడిపోయింది. సరిగ్గా హై వోల్టేజి విద్యుత్ లైన్లు ఉన్న ప్రాంతంలో బెలూన్ దగ్ధమైంది. విద్యుత్ తీగలకు బెలూన్ మంటలు వ్యాపించకపోవటంతో పెను ప్రమాదం తప్పిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు. అమెరికాలో ఎయిర్ బెలూన్లకు ప్రమాదం జరిగిన ఘటనలు చాలా అరుదని.. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో కూడా ప్రాణనష్టం జరిగిందీ తక్కువేనని అధికారులు తెలిపారు. ఈ ఘటన ఎలా జరిగిందన్నదానిపై విచారణ జరుపుతున్నామని వివరించారు.