S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విజయవాడ నడిబొడ్డులో వైఎస్ విగ్రహం తొలగింపు

విజయవాడ, జూలై 30: కృష్ణా పుష్కరాల సందర్భంగా రహదారుల విస్తరణ పేరిట విజయవాడ నగరంలో ప్రార్థనా మందిరాలు, జాతీ య నేతల విగ్రహాల తొలగింపులో భాగంగా శనివారం తెల్లవారుజామున నగర నడిబొడ్డులో ఆర్టీసీ బస్‌స్టేషన్ సమీపంలోని 12 అడుగుల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహం తొలగింపు అధికారుల దుందుడుకు చర్యలకు పరాకాష్ఠగా నిలిచింది. వైఎస్ విగ్రహం తొలగింపు కులమతాలకతీతంగా కాంగ్రెస్, వైఎస్ అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు. దీనిపై ఉద్యమం చేసేందుకు ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. 2012లో నాటి ఎంపి లగడపాటి రాజగోపాల్ దాదాపు రూ.30 లక్షలు వెచ్చించి ఈ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. దీన్ని గోదావరి జిల్లా కొత్తపేట వడయార్‌లో తయారు చేయించారు. విగ్రహం ఎత్తు 12 అడుగులు కాగా దీనికై ఏర్పాటు చేసిన దిమ్మె మరో 12 అడుగులు ఉంది. బందరు, ఏలూరు రోడ్డులోనుంచి వన్‌టౌన్‌లోకి వెళ్లే ప్రతి ఒక్కరికీ ఈ విగ్రహం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. పైగా పుష్కర స్నానాలకు వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఈ విగ్రహం మీద నుంచే వెళ్లాల్సి ఉంది. అందుకే అసూయతో, విద్వేషంతో ఈ విగ్రహాన్ని ముందస్తు సమాచారం లేకుండానే తొలగించారంటూ కాంగ్రెస్, వైకాపా నేతలు విమర్శిస్తున్నారు. తెల్లవారేసరికే విగ్రహం తొలగించబడగా దిమ్మె తొలగించడానికి సాయంత్రం వరకు పట్టింది. ఈ దృశ్యాన్ని చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలిరావటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కల్గింది. నేటి తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో పోలీసులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో విగ్రహం వద్దకు చేరుకున్నారు. సమాచారం తెలుసుకుని వైకాపాకు చెందిన మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ, జోగి రమేష్ నేతృత్వంలో కార్పొరేటర్లు, నాయకులు, లగడపాటి అనుచరులు అక్కడకు చేరుకుని అడ్డు పడ్డారు. ఈ సందర్భంగా వాగ్వాదం, తోపులాట చోటు చేసుకొని ఉద్రిక్తత నెలకొంది. సా యంత్రం పోలీసులు నాయకులను చెల్లాచెదరు చేసి వంగవీటి, జోగి, మరికొంత మందిని సుదూర ప్రాంత పోలీస్ స్టేషన్లకు తరలించి మూడు జెసిబిలు, ఒక క్రేన్‌తో విగ్రహాన్ని తొలగించారు.
ఇదిలా ఉండగా నగరానికి చేరుకున్న రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు నేతృత్వంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు, పిసిసి ప్రధాన కార్యదర్శులు నరహరిశెట్టి నరసింహరావు, ఆకుల శ్రీనివాస కుమార్, మీసాల రాజేశ్వరరావు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు వైఎస్ విగ్రహం తొలగింపు స్థలాన్ని పరిశీలించారు.

చిత్రం.. వైఎస్ భారీ విగ్రహాన్ని తొలగిస్తున్న దృశ్యం