మనోజ్ కొత్త చిత్రం
Published Sunday, 31 July 2016మనోజ్ కథానాయకుడుగా క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.సత్య దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, యాక్షన్, యూత్‌ఫుల్ ప్రేమకథాచిత్రంగా ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్గా రూపొందించనున్నామని తెలిపారు. మనోజ్ పాత్ర హైలెట్‌గా నిలిచే ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాత వరుణ్ అట్లూరి త్వరలోనే మరిన్ని విశేషాలు తెలియజేస్తారని, హీరోయిన్ని ఎంపిక చేసి, షెడ్యూల్ వివరాలు ప్రకటించనున్నామని అన్నారు. రాజేంద్రప్రసాద్, సంపత్ కీలక పాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వసంత్, కెమెరా: సిద్ధార్థ రామస్వామి, నిర్మాత: వరుణ్ అట్లూరి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.ఎస్.సత్య.