S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కరవు నివారణకే హరితహారం: జగదీష్‌రెడ్డి

సూర్యాపేట, జూలై 31: రాష్ట్రంలో ఉత్పన్నమవుతున్న వరస కరవు పరస్థితులను నివారించేందుకు ముఖ్యమంత్రి కెసి ఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతుందని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్ది శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 19,21, 24వ వార్డుల్లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణను నిర్లక్ష్యం చేశారని దాని ఫలితంగానే అడవుల విస్తీర్ణం తగ్గిపోయి వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. ఈ అంశంపై అధ్యాయనం చేసిన ముఖ్యమంత్రి కెసి ఆర్ భవిష్యత్ తరాల కోసం గత పాలకులకు భిన్నంగా హరితహారం కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్నారని పేర్కొన్నారు. సయుక్త రాష్ట్రంలో చేపట్టిన మొక్కల పెంపకం ప్రచార్భాటానికి, కాగితాలకే పరిమితమైందని, నేడు అందుకు భిన్నంగా ప్రజల భాగస్వామ్యంతో మొక్కలు నాటించడంతో పాటు వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రజానికం హరితహారంలో స్వచ్చందంగా భాగస్వామ్యమవుతున్నారని చెప్పారు. హరితహారంలో భాగస్వామ్యమవుతున్న విద్యార్థులు, మహిళా సంఘాలు, ఉద్యోగులు, స్వచ్చంద సంస్థలు, అన్ని వర్గాల ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరు తమ ఇండ్లు, పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఆర్డీవో సి.నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, డిఎస్పి సునీతామోహన్, వైస్‌చైర్‌పర్సన్ నేరేళ్ల లక్ష్మి, ఎంపిపి వట్టె జానయ్యయాదవ్, తహశీల్దార్ మహమూద్ అలీ, మున్సిపల్ కమీషనర్ వడ్డె సురేందర్, పట్టణ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌పాల్గొన్నారు.