S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పనులా...పంటలా..!

నల్లగొండ, జూలై 31: జిల్లాలో ఇరిగేషన్ శాఖ చేపట్టిన మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, మూసీ కాలువల నిర్మాణం, కాలువలపై వంతెనల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయించడంలో ఆ శాఖ అధికారులు రైతులకు, ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు మధ్య నలిగిపోతున్నారు. మంజూరైన పనులను పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఒకవైపు, పంటల సాగుకు చెరువులకు, కాలువలకు నీళ్లు వదులాలంటు రైతులు, ప్రతిపక్ష నాయకులు ఇరిగేషన్ ఏఈ, డిఈలపై తీవ్ర ఒత్తిడి సాగిస్తున్నారు. రకరకాల డిమాండ్లతో ఎదురవుతున్న ఒత్తిళ్ల మధ్య చివరకు ఏ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయోనన్న టెన్షన్‌తో వారు రోజులు వెళ్లదీస్తున్నారు. భువనగిరి డివిజన్ పరిధిలో ఎక్కువగా ఈ రకమైన ఒత్తిళ్లు ఇరిగేషన్ అధికారులకు ఎదురవుతుండగా వారికి మార్గదర్శకం చేయాల్సిన ఉన్నతాధికారులు కృష్ణా పుష్కర ఏర్పాట్ల పనుల్లో తలమునకలేస్తుండటంతో రైతులకు, ఇరిగేషన్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు మద్య వివాదాలు మరింత జఠిలమవుతున్నాయి.
ముఖ్యంగా మూసీ నది కాలువలు పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగానికాలువల అసంపూర్తి పనులు కొనసాగించే విషయమై అధికార టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో మిషన్ కాకతీయ కిందవాటితో పాటు భీమలింగం కాలువ పరిధిలోని మెజార్టీ చెరువుల్లో మరమ్మతు పనులు సాగుతున్నాయి. ఇందుకు కలెక్టర్ గతంలోనే క్రాప్‌హాలిడే ప్రకటించారు.
పనుల్లో జాప్యం..నీళ్లకై రైతుల ఆరాటం..!
మిషన్ కాకతీయ పనులు ఆలస్యంగా మొదలవ్వడం..ఎక్కువగా అధికార పార్టీ వారే కాంట్రాక్టర్లుగా ఉండటంతో పనులు నెమ్మదిగా సాగడం, వర్షాలు పడటం వంటి కారణాలతో సకాలంలో చెరువుల మరమ్మతులు పూర్తవ్వలేదు. దీనికి తోడు మూసీ కాలువల అసంపూర్తి పనుల పూర్తికి ఇటీవల సీఎం కెసిఆర్ 350కోట్లు మంజూరు చేస్తామని చెప్పి ఇప్పటికే 100కోట్లు విడుదల చేయడంతో ధర్మారెడ్డి, బునాదిగాని, పిల్లాయిపల్లి కాలువల అసంపూర్తి పనులు కొనసాగించాల్సివచ్చింది. అలాగే భీమలింగం కాలువ విస్తరణ, వంతెనలు(స్ట్రక్చర్స్) నిర్మాణాలు జరుపాల్సివుంది. ముఖ్యంగా కాలువలు దాటాల్సిన రైతులు వంతెనలు లేక ఇంతకాలం పొరుగు రైతుల భూముల గుండా తమ పొలాలకు చేరుకునేవారు.
ఇప్పుడు భూముల ధరలు పెరిగిపోవడంతో బాటలు నిలిపివేయడంతో రైతులకు కాలువలపై వంతెనలు అత్యవసరమయ్యాయి. వంతెనలు లేక పలువురు రైతులు పంటల సాగు ఆపివేసి ఆర్ధికంగా చితికిపోతున్నారు. భీమలింగం కాలువపై 28వంతెనలు మంజూరైనప్పటికి ఇప్పటిదాకా పనులు చేపట్టపోవడంతో వాటితో ప్రయోజనం పొందే రైతులు ఎదురుచూపులు పడుతున్నారు.
ఇదే సమయంలో దిగువ ప్రాంత నాయకులు, రైతులు తమకు వర్షకాలం పంటకు నీళ్లు వదులాలంటు అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తు వివాదాలకు దిగుతున్నారు.
ఎగువన కాలువల పనులు, చెరువుల మరమ్మతులు జరుగుతుండటం, వంతెనలు నిర్మించాల్సివుండటంతో కాలువలకు నీటి విడుదల సాధ్యం కాదని అధికారులు చెబుతుండగా వారిపై రాజకీయంగా ఒత్తిళ్లు సాగిస్తు ఆందోనకు గురి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డిఈ,ఏఈలకు మార్గనిర్ధేశం చేసి సమస్యలు పరిష్కరించాల్సిన ఉన్నతాధికారులు పూర్తిగా కృష్ణా పుష్కరాల పనుల్లోనే నిమగ్నమవ్వడంతో మూసీ ప్రాంతంలో ఇరిగేషన్ శాఖ అధికారులు స్థానికంగా ఎవరికి వారు నిర్ణయాలు తీసుకుంటు మరిన్ని వివాదాల పాలవుతుండటం చర్చనీయాంశమైంది.