S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘యాదాద్రి వర్తక సంఘానికే 113 షాపులు’

యాదగిరిగుట్ట, జూలై 31: ఆగస్టు 15న 113 షాపులను కొండపైన గల వర్తక సంఘానికి అధికారికంగా అప్పగిస్తామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్.గీత తెలిపారు. ఆదివారం నాడు ఈ విషయంపై ఆలయ ఈ ఓ ను ప్రశ్నించగా వర్తక సంఘం వారు తమ అవసరానుసారం 50 షాపులు గాని లేదా 113షాపులు గాని ఏర్పాటు చేసుకోవచ్చునని అయితే వాటి ద్వారా ప్రస్తుతం చెల్లిస్తున్న మాదిరిగానే ప్రతి నెలా 16.30 లక్షల రూపాయలు మాత్రం దేవస్థానానికి చెల్లించ వలసి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. సొమ్ము చెల్లించని షాపులు రద్దు చేయడం జరుగుతుందన్నారు. కొండపైన కొనసాగుతున్న బ్లాస్టింగ్‌లపై ప్రశ్నించగా త్వరలో నిపుణుల కమిటీ యాదాద్రికి వచ్చి ఈ విషయమై అంచనా వేసి సలహాలు సూచనలు ఇస్తుందని వాటి ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.పదవీ విరమణ గడువు దాటిన తర్వాత కూడా ఉద్యోగంలో ఒక నాల్గవ తరగతి ఉద్యోగి కొనసాగిన నేపథ్యంలో ఆమెకు చెల్లించిన ఐదు నెలల వేతనాన్ని తిరిగి రికవరీ చేశామని గీత తెలిపారు. ఆ ఉద్యోగి పుట్టినతేదీ రికార్డుల్లో తప్పుగా నమోదు కావడం వల్ల తప్పిదం జరిగిందని వాటిని సరిదిద్దడం కూడా జరిగిందని తెలిపారు. త్వరలో తాను బదిలీ కానున్నట్లు వచ్చిన పుకార్ల గురించి ప్రస్తావించగా ఉద్యోగ రీత్యా బదిలీలు సహజమేనని, బదిలీ అంటూ జరిగితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ అభిప్రాయ పడ్డారు. పుష్కరిణి వద్ద గల సుమారు 10 అడుగుల ఆంజేనేయ స్వామి విగ్రహం ఇటీవల ఈదురు గాలులతో కూడిన వర్షానికి చెట్టు విరిగి ఆంజనేయ స్వామి విగ్రహంపై పడడంతో విగ్రహం ధ్వంసమైంది. నూతన విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్టిస్తారని ప్రశ్నించగా త్వరలో పుష్కరిణిని విస్తరిస్తున్నామని టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని పుష్కరిణి విస్తరణ పూర్తి కాగానే గతంలో మాదిరిగా కొత్త విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని వివరించారు.