S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం

నంగునూరు, జూలై 31: ఇంటింటా స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జడ్పి వైస్ చైర్మన్ సారయ్య అన్నారు. ఆదివారం మండలంలోని మగ్దుంపూర్‌లో మిషన్ భగీరథ పైపులైన్ పనులను ప్రారంభించి మాట్లాడారు. గతంలో వేసిన పైపులకు కాలం చెల్లిందని, మరమ్మత్తులు చేయడం వల్ల ఇంటింటా నీరు అందడం లేదన్నారు. ఇది గమనించిన టిఆర్‌ఎస్ సర్కార్ మిషన్ భగీరథ చేపట్టిందన్నారు. మండలంలో ఇప్పటికే పనులు ప్రారంభమైనాయని, త్వరలో పనులుపూర్తి చేసి ఇంటింటికీ నీరందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. ప్రతి గ్రామంలో ట్యాంకు నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఈ పైపులైన్‌తో ఎత్తు, వంపుల్లో ఉన్న ప్రతి ఇంటికి సమానంగా నీరు సరఫరా అవుతుందన్నారు. ఈ పనుల నిర్మాణాలకు ప్రజలు సహకరించాలన్నారు. ఎంపిపి శ్రీకాంత్‌రెడ్డి, సొసైటి చైర్మన్ సోమిరెడ్డి, సర్పంచు భాస్కర్‌రెడ్డి, ఎంపిటిసి లావణ్య, నేతలు శంకర్, పరమేశ్వర్‌రెడ్డి, మల్లయ్య పాల్గొన్నారు.