S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బండపోతుగల్ నుంచి జోగిపేటకు విస్తరించిన అతిసార

జోగిపేట, జూలై 31: కూడిపల్లి మండలం బండపోతుగల్, తదితర ప్రాంతాల్లో అతిసార వ్యాధి సోకిన రోగులు జోగిపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం విధితమే. కాగా ఈ వ్యాధి ఆస్పత్రి నుంచి జోగిపేట పట్టణవాసులకీ వ్యాపించింది. ఆదివారం నాడు ఒకేరోజు జోగిపేట పట్టణానికి చెందిన 8 మంది రోగులు అతిసార వ్యాధి సోకి జోగిపేట ఆస్పత్రిలో చేరారు. గత ఐదు రోజులుగా కౌడిపల్లి మండలం బండపోతుగల్ గ్రామానికి చెందిన బాధితులు ఇక్కడ చికిత్సలు పొందుతున్న విషయం విధితమే. పట్టణంలో కూడా వ్యాధి రోగులు పెరుగుతున్నారు. ఒకే రోజు 8 మంది చేరడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వైద్యులు మాత్రం వారికి పరీక్షలు నిర్వహిస్తూ చికిత్స అందజేస్తున్నారు.