S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భూములు ఇచ్చేందుకు సింగారం గ్రామస్థులు సిద్ధం

కొండపాక, జూలై 31: మల్లన్నసాగర్ ముంపుగ్రామం సింగారం నిర్వాసితులు ఆదివారం మంత్రి హరీష్‌రావును కలిసి భూములు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపారు. మండలంలోని సింగారంకు చెందిన నిర్వాసితులు మంత్రి హరీష్‌రావుతో చర్చలు జరిపి భూములు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని, తమకు సరైన న్యాయం చేయాలని కోరినట్లు తెలిసింది. అలాగే తమకు ఏలాంటి అన్యాయం జరుగకుండా చూస్తామని, గ్రామం ముంపుకు గురైతున్నందున అందరికి ఇండ్లు నిర్మించి మరో సింగారం గ్రామం నిర్మించి ఇస్తామని మంత్రి హామినిచ్చినట్లు సమాచారం. 123జిఓ ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు మంతనాలు జరిగినట్లు తెలిసింది. గ్రామాలు విడిచి పోతున్న నిర్వాసితులకు ఏలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటామని హామినిచ్చినట్లు తెలిసింది. ఏ పథకమైనా భూనిర్వాసితులకే ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పినట్లు తెలిసింది. గ్రామాలు విడిచి పోవాలంటే ఎవరికైనా బాధగా ఉంటుందని, మీరు విడిచి పోతున్న బాధ నాకు కూడా ఉందని, కానీ వేలాది మంది రైతుల బతుకులు బాగుపడేందుకు త్యాగం చేస్తున్న మీకు కృతజ్ఞతలు చెప్పినట్లు సమాచారం. ప్రతిపక్షాల మాటలు విని నష్టపోవద్దని, సిఎం కెసిఆర్ మీకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారన్నారు. అలాగే ఇప్పుడున్న అభివృద్ధి కంటే మరింత అభివృద్ధితో ముంపు గ్రామాల ఫ్రజలు ముందుకు సాగాలని సూచించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో ముంపు గ్రామాల ప్రజలు, టిఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.