S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘అనుమతిలేని ఎన్‌టిఆర్ విగ్రహ నిర్మాణం ఆపాలి’

అమరావతి, జూలై 31: అమరావతిలోని పెదమద్దూరు సెంటర్ వద్ద అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలాంటి అనుమతులు లేకుండా ఎన్‌టిఆర్ విగ్రహం ఏర్పాటుకు నిర్మాణాలు చేస్తున్నారని, వాటిని వెంటనే నిలుపుదల చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పెదకూరపాడు నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కావటి మనోహర్ నాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన స్థానిక వైసిపి నాయకులతో కలిసి విగ్రహ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్‌ఐ వెంకట ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కావటి మనోహర్ నాయుడు విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అధికార ప్రభుత్వం రోడ్ల విస్తరణ పేరుతో రోడ్డు పక్కనున్న దేవాలయాలు, చర్చిలు, మసీదులు, నాయకులు, మహానేతల విగ్రహాలు కూల్చివేశారన్నాన్నారు. సంబంధిత ఆలయ కమిటీలకు సమాచారం లేకుండాన అధికార దర్పంతో నిబంధనలను తుంగలో తొక్కి విగ్రహాలను కూల్చివేయడం హేయమైన చర్య అన్నారు. విజయవాడలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విగ్రహాన్ని తొలగించిన చంద్రబాబు నాయుడు నిన్న జరిగిన ఒక సమావేశంలో విగ్రహాల ప్రేమ ఉంటే తమ తమ నేతల విగ్రహాలను వారి వారి ఇళ్లలో ఏర్పాటు చేసుకోవాలని, విగ్రహాల విషయంపై ప్రభుత్వం ఒక చట్టాన్ని అమలు చేసి, చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీచేసిందన్నారు. అమరావతిలో అందుకు భిన్నంగా అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం పుష్కరాల సందర్భంగా ఏర్పాటుచేసిన రోడ్డును పగలకొట్టి ఎన్‌టిఆర్ విగ్రహ ఏర్పాటుకు దిమ్మె నిర్మించడం పట్ల గ్రామంలో రాజకీయ కక్షలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. విగ్రహ నిర్మాణాన్ని ఆపకుంటే పార్టీ పరంగా ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైసిపి నాయకులు మంగిశెట్టి కోటేశ్వరరావు, మేకల హనుమంతరావు యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు కోట హరిబాబు, శ్రీకాంత్, సాయిరెడ్డి, యువజన విభాగం నాయకులు ఉప్పుటూరి నర్సిరెడ్డి, మైనార్టీ నాయకులు షేక్ జానావలితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.