S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శాకాంబరిగా దర్శనమిచ్చిన లలితాంబిక

గుంటూరు (కల్చరల్), జూలై 31: గ్రీష్మరుతువు ముగిసి వర్షరుతువు ప్రారంభమైన నేపథ్యంలో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి భక్తులకు కనువిందు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. దేవీ భాగవతంలో చెప్పినట్లు ఆషాడమాసం, వర్షరుతువులో లభించే అన్ని కూరగాయలు, పుష్పాలతో అమ్మను అలంకరించినట్లయితే సకల జనావళికి శుభం కలుగుతుందన్న పెద్దల వాక్యాలను ఆదేశంగా తీసుకుని గత వారం రోజులుగా నగరంలోని అనేక దేవాలయాల్లో జగన్మాతన శాకాంబరిదేవిగా అలంకరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆదివారం బ్రాడీపేటలోని బడబానల ఆంజనేయ స్వామి దేవాలయంలో కొలువైయున్న శ్రీ లలితా త్రిపుర సుందరిదేవిని శాకాంబరిదేవిగా అలంకరించి నేత్రపర్వం చేశారు. శాకం అంటే కూర అంబరం అంటే వస్త్రం అని శాస్త్రం చెప్తున్నది. ఆషాడమాసంలో జరిపే నవరాత్రులను శాకాంబరి నవరాత్రులుగా పిలుస్తుంటాం. ఈ నవరాత్రుల్లో భాగంగానే కూరగాయలను వస్త్రంగా ధరించి అమ్మ భక్తులను అనుగ్రహించింది. తన పిడికిలిలో వరికంకును చేబూని, ఇతర హస్తాలలో పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులను చేపట్టి భక్తులను అమ్మవారు ఆశీర్వదించింది. అధిక సంఖ్యలో భక్తులు, దేవాలయ ప్రతినిధులు అమ్మను సేవించుకున్నారు.