S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉద్యాన పంటలలో మొదటి స్థానానికి కృషి

యడ్లపాడు, జూలై 31: ఉద్యాన పంటల సాగులో దేశంలో 5వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని మొదటిస్థానానికి తెచ్చేందుకు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్యమంత్రి నేతృత్వంలో నిర్విరామ కృషి చేస్తున్నారని డాక్టర్ వై ఎస్ ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ పాలకవర్గ సభ్యుడు పోపూరి శివరామకృష్ణ అన్నారు. ఆదివారం యడ్లపాడులో విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ వ్యవసాయ వాతావరణ మండలాలు, భూమి భౌతిక లక్షణాలు ఉద్యాన పంటల సాగుకు అనుకూలంగా ఉన్నాయని, రాష్ట్రప్రభుత్వం కూడా ఆ దిశగా వివిధ పథకాలను రూపొందించి వాటి అమలుకు కృషి చేస్తుందని అన్నారు. పత్తి తదితర పంటల సాగుకే పరిమితమైన రైతులను కూడా ఉద్యాన పంటల సాగుకు మొగ్గు చూపేలా కృషి జరుగుతోందని తెలిపారు. మన రాష్ట్రంలో 18.81 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయన్నారు. ఈ పంటల ద్వారా రాష్ట్రంలో 217.16 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతుందన్నారు. ఈ మొత్తం విస్తీర్ణాన్ని, ఉత్పత్తిని మరింత పెంచేందుకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారన్నారు. ఉద్యాన పంటల అభివృద్ధికి ఇప్పటికే ఉద్యాన విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో రాష్ట్రంలోని 18 ప్రాంతాల్లో పరిశోధనా క్షేత్రాలు, కృషీ విజ్ఞాన కేంద్రాల ద్వారా శాస్తవ్రేత్తలు ఉద్యానపంటల అభివృద్ధికి నిరంతరం పరిశోధనలు చేస్తున్నారన్నారు. ఈ పరిశోధనల ఫలితాలు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు ఉద్యాన రైతులకు చేరేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయస్థాయిలో సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో 3,04,111 హెక్టార్లలో మామిడి పంట సాగవుతుందని తద్వారా 2,37,008 టన్నుల ఉత్పత్తి జరుగుతుందన్నారు. త్వరలో ఉద్యాన పంటల సాగులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు.
ప్రాంతీయ సదస్సులు...
ఉద్యాన పంటల సాగుకు సంబంధించి ప్రభుత్వ పథకాలను శాస్తవ్రేత్తల సలహాలను రైతులకు వివరించేందుకు త్వరలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు శివరామకృష్ణ తెలిపారు. ఆయా ప్రాంతాల నుండి వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు, శాస్తవ్రేత్తలు సదస్సులలో రైతులకు ఉద్యాన పంటల గురించి వివరిస్తారని తెలిపారు. ఈ క్రమంలో ప్రథమంగా మిర్చిపంటకు సంబంధించిన సమావేశాన్ని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో త్వరలో చిలకలూరిపేటలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇతర పంటలు సాగుచేసే రైతులు ఉద్యాన పంటలు కూడా వీలైన మేరకు సాగుచేసేలా కృషిచేసి తద్వారా రైతుల అభివృద్ధి, ఉత్పత్తుల స్థాయి పెంచడం ఈ సదస్సుల ముఖ్య ఉద్దేశమన్నారు. విలేఖర్ల సమావేశంలో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ముత్తవరపు సుబ్బారావు, జాలాది నీటిసంఘం అధ్యక్షుడు పోపూరి రాఘవయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు పోపూరి రత్తయ్య, జి చిన తిరుపతిరావు, హరిబాబు పాల్గొన్నారు.