S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గోదారమ్మకు మళ్లీ పుష్కర శోభ

భద్రాచలం, జూలై 31: భద్రాద్రిలో గోదావరి తీరం మళ్లీ పుష్కర శోభను సంతరించుకుంది. అంత్యపుష్కరాల సందర్భంగా ఆదివారం భద్రాద్రి రద్దీగా మారింది. భక్తుల జయజయధ్వానాలు, మేళతాళాలు, వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలు, కోలాటాల నడుమ సుముహూర్తాన ఆదివారం ఉదయం అంత్యపుష్కరాలను ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు, దేవస్థానం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు, సర్పంచి భూక్యా శే్వతలు ప్రారంభించారు. గోదావరి మాతకు, గోదావరి నదికి ప్రత్యేక పూజలు చేశారు. పుష్కర జలాలతో పునర్వసు మండపంలో శ్రీసీతారామచంద్రస్వామి ప్రచారమూర్తులకు అభిషేకం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం వేళ గోదావరి నదికి అర్చకులు కుంభ, ద్వయ, అష్ట, ద్వాదశ, నక్షత్ర హారతులు ఇచ్చారు. ఈ దృశ్యాలు భక్తులను పరవశింప చేశాయి. అంత్యపుష్కరాల్లో తొలిరోజు భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. హైకోర్టు జడ్జి దుర్గాప్రసాదరావు, జిల్లా జడ్జి విజయ్‌మోహన్, భద్రాచలం జడ్జి బులికృష్ణ, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తదితరులు అంత్యపుష్కర స్నానాలు ఆచరించారు.
ఊరేగింపుగా గోదావరి తీరానికి...
అంత్యపుష్కరాలు, ఆషాఢమాసోత్సవం ముగింపు సందర్భంగా శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం తలుపులు తెల్లవారుఝామున 3 గంటలకే తెరిచారు. సుప్రభాత సేవ, ఆరాధన, ఆరగింపులు, సేవాకాలం, నిత్యబలిహరణం, నిత్యహోమం, పరివార దేవతల హోమం, నివేదనలు పూర్తి చేశారు. ఉదయం 5 గంటలకు భక్తులకు స్వామి సర్వదర్శనం కల్పించారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు అంతరాలయంలో మూలవరులకు అభిషేకం చేశారు. అనంతరం శ్రీసీతారామచంద్రస్వామి ప్రచారమూర్తులను సమస్త మంగళవాయిద్యాలు, వేదపారాయణాలు, పోలీసు బందోబస్తు నడుమ ఊరేగింపుగా పవిత్ర గోదావరి నదీ తీరానికి తీసుకెళ్లారు. ఒక పల్లకీలో ఆర్ధ్ర నక్షత్రం సందర్భంగా చక్రత్తాళ్వార్, రామానుజుల వారు(ఉడయవరులు)లను ఉంచి తీసుకెళ్లారు. ముందుగా గోదావరి మాత విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పట్టు వస్త్రాలు, శేషమాలికలు, నైవేద్యం సమర్పించారు. తీరంలో పూలాంకృత లాంచీ పైకి శ్రీసీతారామచంద్రస్వామి ప్రచార మూర్తులు, రామానుజుల వారు, చక్రత్తాళ్వార్‌లను వేంచేసింప చేశారు. స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన చేశారు. స్వామితో పాటు చక్రత్తాళ్వార్, రామానుజుల వారికి కూడా అభిషేకాలు చేశారు. నారీకేళాలు, పంచామృతాలతో స్నపనం చేశాక గోదావరిలోకి రాముల వారి వెండిపాదుకలతో దేవస్థానం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు దిగారు. అక్కడ గోదావరికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, గంధం, పుష్పాలను సమర్పించారు. లక్ష్మీఅష్టోత్తర శతనామార్చనలు చేశారు. అరటి పండ్లు, చక్కెర పొంగలి నివేదించారు. ఐటిడిఎ పిఓ రాజీవ్‌గాంధీ హన్మంతు, దేవస్థానం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు, సర్పంచి భూక్యా శే్వతలు అంత్యపుష్కరాలను ప్రారంభించారు. భక్తులు అంతా అదే సమయంలో అంత్యపుష్కర స్నానాలు చేశారు. అనంతరం మూడు వెండి బిందెలతో తీర్థజలాలను పునర్వసు మండపానికి తీసుకెళ్ళారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర బిందెలుగా నామకరణం చేసి ఆ జలాలతో భక్తుల కోలాహాలం మధ్య ఆ నీటితో శ్రీసీతారామచంద్రస్వామికి అభిషేకం చేశారు. సాయంత్రం నదీ హారతి కార్యక్రమం విశేషంగా జరిగింది.