S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మల్లన్న సాగర్ నిర్వాసితులకు సరైన పరిహారం ఇవ్వాలి

మంచిర్యాల, జూలై 31: మల్లన్న సాగర్ ముంపు ప్రజలకు సరైన నష్టపరిహారం ఇవ్వాలని ఆందోళన చేసిన రైతులు, ప్రజలపై ప్రభుత్వం లాఠీ చార్జి చేయించడంతో రైతులను పరామర్శించేందుకు వెళ్లే ప్రతిపక్షాలను అడ్డుకోవడంలో ఆంతర్యమేమిటని మాజీ హోంమంత్రి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సబితా ఇంద్రా రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏ ప్రభుత్వాలైనా ప్రాజెక్టులకు రీ డిజైనింగ్ చేయాలంటే బడ్జెట్‌లో ఆమోదం పొంది, డీ ఎస్ ఆర్ ద్వారానే నోటిఫికేషన్ విడుదల చేసి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, ఈ ప్రభుత్వం మాత్రం నియంత పాలనగా వ్యవహరిస్తూ ఇష్టానుసారంగా ప్రాజెక్టులను నిర్మిస్తున్నారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పరిశ్రమలను నెలకొల్పే ప్రాంతాల్లో భూములు కోల్పోయిన వారికి సరైన పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ 2013లో భూ ఆర్డినెన్స్ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. మల్లన్నసాగర్‌లో ఆర్డినెన్స్‌ను పక్కన పెట్టి బెదిరింపులకు పాల్పడి భూములు లాక్కునే విధంగా ప్రభుత్వ పాలన ఉందన్నారు. ప్రభుత్వం సరైన న్యాయం చేయనపుడు ప్రతిపక్షాలు ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయాల్సి ఉండగా, మల్లన్న సాగర్ ప్రాంతాన్ని నిషేదిత ప్రాంతంగా పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగిస్తూ ఆ గ్రామాలకు పోనివ్వకుండా అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎంసెట్-1,2 పరీక్షలు నిర్వహించినప్పటికీ ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీతో ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతోందన్నారు. అసమర్థ పాలన వలన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని, ఎంసెట్-3 నిర్వహిస్తామని చెప్పడం రాష్ట్ర ముఖ్యమంత్రి పాలనకు సిగ్గుచేటన్నారు. ఎంసెట్ నిర్వహించే ముందు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. క్వాలిటీ విద్య కోసం రాష్ట్రంలోని దాదాపు 70 ఇంజినీరింగ్ కళాశాలలను మూసివేయడంతో 50వేల మంది విద్యార్థులకు విద్య అందకుండా పోతోందని మండిపడ్డారు. అదేవిధంగా ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లిస్తామని, రూ.200కోట్ల బకాయిలు రిలీజ్ చేయకుండా జీవో ఇచ్చి కాలయపాన చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రెండేళ్ల పాలనలో యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్‌లను నియమించాల్సి ఉండగా, ఇప్పటి వరకు కూడా నియమించక వారికి అనుకూలంగా ఉన్నవారిని వీసిలుగా నియమించడంతో హై కోర్టు అక్షింతలు వేసిందన్నారు. కేసీ ఆర్ పాలనలో హై కోర్టు అక్షింతలే తప్ప సరైన పాలన లేదన్నారు. తెలంగాణ ప్రాంతంలోని సింగరేణిని బొద్దల గడ్డగా మార్చకుండా ఓసిలను అడ్డుకుంటామని ఉద్యమ కాలంలో చెప్పి ఇప్పటి వరకు కూడా జిల్లాలోని కోల్‌బెల్ట్ ప్రాంతమైన బెల్లంపల్లి, శ్రీరాంపూర్ ఏరియాల్లో రెండేళ్లలో అడుగుపెట్టలేదన్నారు. ఇక్కడే కూర్చొని ఓసిపిలను అడ్డుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి ఓసిపిల వద్ద కుర్చీలేదు... సచివాలయంలో కుర్చీ లేదు... ఫామ్ హౌజ్‌లో మాత్రం కుర్చీ వేసుకొని పాలనను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌కు నీటిని తరలించేందుకు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పైపులైన్‌ల ద్వారా నీటి సరఫరాకు రూ.3500కోట్ల నిధులు కేటాయించి పనులు చేపట్టగా, అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి కేటీ ఆర్ ప్రారంభించి హైదరాబాద్‌కు గోదావరి జలాలను అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. కృష్ణా జలాల నుంచి 1,2,3 ఫేస్‌ల నుంచి నీటిని సరఫరా చేస్తే గోదావరి నుంచి కూడా నీటిని తీసుకెళితే రాబోయే తరాలకు కూడా నీరు అవసరముంటుందని రాజశేఖర్ రెడ్డి ప్రతిపాదనలతో పైపులైన్ పనులు పూర్తి చేస్తే తెరాస ప్రభుత్వం నిధులు కేటాయించకుండా నీళ్లు ఇచ్చామనడం సరికాదని అన్నారు. ఇప్పటి వరకు కూడా హైదరాబాద్‌లో తాగునీటి సమస్య అదేవిధంగా కొట్టుమిట్టాడుతుందన్నారు. ఎల్లంపల్లి భూ నిర్వాసితులకు పరిహారం ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని అన్నారు. తెరాస పాలన అనుభవం లేని విధంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గడ్డం అరవిందరెడ్డి, సంజీవరావు, నాయకులు నరేష్ జాదవ్, ఫ్లోర్ లీడర్ శ్రీపతి శ్రీనివాస్, నాయకులు రమేష్, చంద్రవౌళి, రఘునాథ రెడ్డి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.