S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విధులలో ప్రతిభ చూపిన పోలీసు సిబ్బందికి నగదు రివార్డులు

విజయనగరం, జూలై 31: విజయనగరం పట్టణంలోని గాజులరేగ ప్రాంతంలో యువతి హత్యాయత్నం కేసులో సకాలంలో స్పందించిన టూటౌన్ ఎస్సై రవికి ఎస్పీ కాళిదాసు ఆదివారం నగదు రివార్డు అందజేశారు. ప్రేమను నిరాకరించిందనే కోపంతో గౌతమి అనే యువతిని కుసుమంచి విక్రమ్ అనే యువకుడు గొంతుకోసి చంపేందుకు ప్రయత్నించిన సంఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ సంఘటన జరిగిన సమయంలో ఎస్సై రవి సకాలంలో స్పందించి ఆమెను ఆసుపత్రిలో చేర్పించడం ద్వారా ప్రాణాపాయ స్థితినుండి బయటపడేలా చూడగలిగారు. ఈ ఘటనలో నిందితుడు విక్రమ్‌ను ఒకరోజులోనే అరెస్టు చేశారు. విధి నిర్వహణలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై రవికి ఎస్పీ కాళిదాసు రెండు వేల రూపాయల నగదు బహుమతి అందజేశారు. ఈ కేసులో తీవ్రంగా గాయపడిన బాదితురాలికి అవసరమైన రక్తం లభించని పరిస్థితులలో విజయనగరం టూటౌన్ హెడ్‌కానిస్టేబుల్ పెండ్యాల శ్రీనివాసరావు రక్తదానం చేసి యువతిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడగలిగారు. దీనిపై ఎస్పీ కాళిదాసు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావుకు కూడా రెండు వేల రూపాయల నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కాళిదాసు మాట్లాడుతూ నేరాలు జరిగినప్పుడు పోలీసులు సకాలంలో స్పందిస్తే నిందితులను వెంటనే పట్టుకునేందుకు అవకాశం ఉంటుందని, దీనివల్ల పోలీసులపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందన్నారు. బాధితులకు న్యాయం చేయడంతోపాటు సామాజిక కార్యక్రమాలలో పోలీసులు పాలుపంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ త్రినాథ్, టూటౌన్ సిఐ ప్రసాద్ పాల్గొన్నారు.