S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శానిటరీ ఇన్స్‌పెక్టర్ సత్యనారాయణను సస్పెండు చెయ్యాలి

పాలకొల్లు, జూలై 31: తనకున్న విధులు నిర్వర్తించకపోగా కౌన్సిల్‌ర్లను దొంగలని కౌన్సిల్ సమావేశంలో చెప్పటం సహించరాని నేరమని, కౌన్సిల్‌ను కించపరిచిన వ్యక్తిని తక్షణం సస్పెండు చెయ్యాలని ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. ఉద్యోగులంటే తమకు చాలా గౌరవం ఉందని, కానీ తప్పుచేసిన వారిని వెనకేసుకొచ్చే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. మున్సిపల్ ఛైర్మన్ వల్లభు నారాయణమూర్తి, వైస్ ఛైర్‌పర్సన్ కర్నేన రోజారమణి, పెచ్చెట్టి బాబు, జివి, బేరం శ్రీరామచంద్రమూర్తి, వట్టం గణేష్, కర్నేన గౌరినాయుడు, చీకట్ల గౌరీశంకర్, కమిషనర్ కె సాయిరామ్, మున్సిపల్ ఇంజనీరు నరసింహరావు తదితర్లు సమావేశంలో పాల్గొన్నారు.