S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘పట్టిసీమ’తో మెట్టను డెల్టాగా తీర్చిదిద్దుతాం

ఏలూరు, జూలై 31 : మెట్ట ప్రాంతాన్ని పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా డెల్టాగా తీర్చిదిద్దుతామని భవిష్యత్తులో మెట్ట ప్రాంతాలు సమృద్ధిగా గోదావరి జలాలు తాగు, సేద్యపునీరుగా అందించడమే ప్రధాన ధ్యేయమని ఏలూరు ఎంపి మాగంటి బాబు చెప్పారు. స్థానిక ఎంపి క్యాంపు కార్యాలయంలో ఆదివారం పెదవేగి, ద్వారకాతిరుమల, టి నరసాపురం తదితర ప్రాంతాల నుండి వచ్చిన పలువురు రైతులు మాగంటి బాబుకు వినతిపత్రం సమర్పిస్తూ తమ ప్రాంతంలో పోలవరం కుడి కాలువ నుండి పట్టిసీమ జలాలను మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై మాగంటి పోలవరం ప్రాజెక్టు ఎస్ ఇతో ఫోన్‌లో మాట్లాడుతూ పోలవరం కుడికాలువ వెంబడి వున్న గ్రామాలలో మంచినీటి చెరువులు నింపుకోవడానికి గోదావరి జలాలను మోటార్లు ద్వారా మళ్లించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. పట్టిసీమ ఎత్తిపోతల పధకం నుండి పోలవరం కుడికాలువకు సమృద్ధిగా నీదటిని విడుదల చేస్తున్నామని, మెట్ట ప్రాంత ప్రజల అవసరాల కోసం ఎన్ని క్యూసెక్కుల నీరు కావాలన్నా ఎక్కడా కూడా అభ్యంతరం పెట్టవద్దని బాబు కోరారు. జిల్లాలోని మెట్ట ప్రాంత ప్రజలకు తాగునీరు అందించడానికి గోదావరి జలాలను పెద్ద ఎత్తున తరలిస్తామని తాగునీటితో పాటు సేద్యపునీరు కూడా కల్పిస్తామని భవిష్యత్తులో మోటార్ల ద్వారా కాకుండా గోదావరి జలాలు ద్వారా పంటలు పండించుకునే అవకాశాన్ని కల్పిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు.