S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పోలవరం కుడికాలువ పరిశీలన

గోపాలపురం, జూలై 31: పోలవరం కుడికాలువను ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవప్రకాష్ ఆదివారం పరిశీలించారు. గత మూడు రోజులుగా మండలంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడంతో కాలువలు పొంగి పొర్లాయి. పోలవరం కాలువపై అక్కడక్కడ వంతెనలు నిర్మించాల్సిన ప్రదేశంలో అధికారులు గట్టుపై మట్టి పోసి పటిష్టపరిచారు. వర్షాల కారణంగా గట్లు ఏ విధంగా ఉన్నాయోనని ఇఇ దేవప్రకాష్ పరిశీలించారు.
వేదమంత్రోచ్ఛారణతో మారుమోగిన నరసాపురం తీరం
నరసాపురం, జూలై 31:పట్టణంలో గోదావరి అంత్య పుష్కరాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదమంత్రోచ్ఛారణ మధ్య ఎన్టీఆర్ పుష్కర ఘాట్‌లో శ్రీ కమలానంద భారతీ స్వామిజీ ఉదయం 6.45నిమిషాలకు మొదటి పుష్కర స్నానాన్ని ఆచరించారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, నరసాపురం ఎంపి డాక్టర్ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ఛైర్‌పర్సన్ పసుపులేటి రత్నమాలసాయిలు కమలానంద స్వామీజీతోపాటు పుష్కర స్నానాన్ని ఆచరించారు. ముందుగా గోదావరిమాతకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం గోదావరి మాతకు హారతులిచ్చారు. పట్టణంలో ఎన్టీఆర్ పుష్కరఘాట్, అమరేశ్వర స్వామి, కొండాలమ్మ పుష్కరఘాట్‌ల్లో భక్తులు స్నానాలు ఆచరించారు.
ఆకట్టుకున్న పుష్కర శోభాయాత్ర
అంత్య పుష్కరాలను పురస్కరించుకుని పట్టణంలో నిర్వహించిన పుష్కర శోభాయాత్ర ఆకట్టుకుంది. స్థానిక వైఎన్ కళాశాల నుండి ఎన్టీఆర్ పుష్కరఘాట్ వరకు ఈ శోభాయాత్ర సాగింది. ఈ శోభాయాత్రలో కోలాటం, మంగళవాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.
ఆర్యవైశ్య సంఘం సేవలు
అభినందనీయం:మంత్రి పైడికొండల
గోదావరి అంత్య పుష్కరాలకు విచ్చేసే యాత్రీకులకు ఆర్యవైశ్య సంఘం అందిస్తున్న సేవలు అమోఘమని రాష్ట్ర దేవాదాయధర్మాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుపేర్కొన్నారు. స్థానిక వలంధర రేవువద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. మానవసేవే మాధవ సేవ అన్న భావన అందరిలో కలగాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న కృషికి స్వచ్చంద సేవాసంస్థలు, దాతల సేవలు తోడైతే మంచి ఫలితాలు సాధించవచ్చునన్నారు. ఎంపి డాక్టర్ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ఛైర్‌పర్సన్ రత్నమాల, జిల్లా జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు, సబ్ కలెక్టర్ దినేష్‌కుమార్, పశ్చిమడెల్టా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ రామరాజు, ఎంపిపి కనకరాజు, మొగల్తూరు జడ్పీటిసి నాగరాజు, అర్బన్ బ్యాంకు అధ్యక్షులు ఎవి నర్సయ్య, ప్రభుత్వాసుపత్రి సలహా సంఘం అధ్యక్షులు బండారు పటేల్ రాజానాయుడు పాల్గొన్నారు.
డివిజన్‌లో 27,190 మంది స్నానాలు ఆచరించిన భక్తులు
అంత్య పుష్కరాల సందర్భంగా నరసాపురం డివిజన్‌లో ఏర్పాటుచేసిన 15 పుష్కరఘాట్‌ల్లో ఆదివారంనాడు 27,190 మంది పుష్కర స్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. ఆచంటలో 4936, యలమంచిలిలో 2962, నరసాపురం మండలంలో 19,292, పట్టణంలో 16,300 మంది పుష్కర స్నానాలు ఆచరించారు.