S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సబ్‌ప్లాన్ నిధులు సద్వినియోగం చేస్తాం

ఏలూరు, జూలై 31 : ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ నిధులన్నీ కూడా ఒక్క రూపాయికూడా దుర్వినియోగం కాకుండా ఎస్‌సి, ఎస్‌టి ప్రాంతాల అభివృద్ధికి, వారి జీవన ప్రమాణాల పెంపుదలకే ఖర్చు చేస్తామని ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ అన్నారు. ఆదివారం స్థానిక ఇరిగేషన్ గెస్ట్‌హౌస్ వద్ద జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చిన ప్రతీ ఫిర్యాదు కూడా సమగ్రంగా పరిశీలించి న్యాయం చేస్తామని, ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదని స్పష్టం చేశారు. ఎస్‌సి, ఎస్‌టిల పురోభివృద్ధికి పధకాలను రూపొందించి వారి జీవన ప్రమాణాలను పెంపొందిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని అన్నారు. ఎన్నికల ముందు సమావేశాల్లో, ప్రచారాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని తెలియజేసినప్పటికీ అధికారంలోకి వచ్చాక కేంద్రం అమలుచేయలేదన్నారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌ల వ్యవహారం అగమ్యగోచరంగా వుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో వుండగా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా తలుపులు మూసి ప్రసార మాధ్యమాలను నిలుపుదల చేసి మూజువాణి ఓటుతో రాష్ట్ర విభజన జరిపారని దుయ్యబట్టారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించవచ్చని కాంగ్రెస్ కేంద్రానికి లేఖ ఇచ్చిందని అన్నారు. చంద్రబాబు మొదటి నుంచి కూడా సమన్యాయం కావాలని కోరారన్నారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా కోసం మహా ఉద్యమాన్ని నడపాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రానికి కావాల్సిన ఒనరులు, సౌకర్యాలు అడగకుండానే విభజించారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని స్పష్టం చేశారు. ప్రజలను చైతన్యపర్చకుండా ఓటు బ్యాంకు కోసం తహతహలాడి రాష్ట్ర విభజన జరిపారని పేర్కొన్నారు. ఐక్య ఉద్యమంతోనే హోదా సాధ్యమని శివాజీ స్పష్టం చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకపోయినా సి ఎంకు కార్యాలయం లేకపోయినా ఆర్ధిక లోటు వున్నాగానీ నదుల అనుసంధానం, ఒనరుల ఏర్పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. 13 జిల్లాల్లో ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌లాగ్ పోస్టులను మూడు వేలు భర్తీ చేయడం జరిగిందని, వివిధ కార్యాలయాల్లో ఖాళీగా వున్న ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌లాగ్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర వైఖరిలో మార్పు రావాలని, ప్రత్యేక హోదా ఇవ్వక తప్పదని అన్నారు. ఆయన వెంట సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జె ఆర్ లక్ష్మీదేవి, డి ఎంహెచ్ ఓ కె కోటేశ్వరి, పెనుగొండ సర్పంచ్ ఆశాజ్యోతి, ఎస్‌సి, ఎస్‌టి నాయకులు అలుగు ఆనందశేఖర్, పొలిమేర హరికృష్ణ, జిజ్జువరపు ప్రసాద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. డిపివో సుధాకర్, ఎంపిడివో ఎన్ ప్రకాశరావు, పలువురు అధికారులు శివాజీకి పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.