S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అంత్య పుష్కరాలు ప్రారంభం

కొవ్వూరు, జూలై 31: గోదావరి అంత్య పుష్కరాలు ఆదివారం కొవ్వూరులో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గోష్పాదక్షేత్రంలో అనేక మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుజాము నుండే యాత్రికులు గోష్పాద క్షేత్రానికి చేరుకున్నారు. ఉదయం తక్కువ సంఖ్యలో ఉన్నా రానురాను భక్తుల సంఖ్య పెరిగింది. అధికారుల అంచనాలకు మించి భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేశారు. సుమారు 25 వేల మంది స్నానాలు చేసినట్టు అంచనా. అధిక సంఖ్యలో భక్తులు పిండ ప్రదానాలు చేశారు. గోదావరి నదిలో నీరు పుష్కలంగా ఉండడంతో యాత్రికులు ఏ విధమైన ఇబ్బంది లేకుండా స్నానాలు చేశారు. గోష్పాద క్షేత్రంలోని దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి. కొవ్వూరు ఆర్డీవో బి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయడంతో యాత్రికులకు ఏ విధమైన ఇబ్బందులు కలుగలేదు. కొవ్వూరు, పరిసర ప్రాంతాల నుండి, ఇతర జిల్లాల నుండి భక్తులు వాహనాల్లో, ఆటోల్లో వచ్చారు. ఎమ్మెల్యే కెఎస్ జవహర్, ఆర్డీవో శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ సూరపనేని రామ్మోహన్, డిఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు, కమిషనర్ టి నాగేంద్రకుమార్ తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. జిల్లా అగ్నిమాపక శాఖాధికారి వీరభద్రరావు పర్యవేక్షణలో స్థానిక ఫైరాఫీసర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, సిబ్బంది సేవలందించారు. దేవాదాయ శాఖ ఇన్స్‌పెక్టర్ కెవివి రమణ ఆధ్వర్యంలో ఆలయాల వద్ద భక్తులకు ఏర్పాట్లు చేశారు. స్థానిక ప్రభుత్వాసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఐసిడిఎస్ సూపర్‌వైజర్ వైబిటి సుందరి ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, సిబ్బంది పిల్లలకు పాలు, బిస్కెట్లు అందచేశారు. ప్రముఖ వ్యాపారవేత్త ఏక్‌రాజ్ జైన్ పిల్లలకు పాలు అందించగా, ఆకివీడుకు చెందిన వానపల్లి బాబూరావు బిస్కెట్లు పంపిణీ చేశారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో యాత్రికులకు తాగునీర సరఫరా చేశారు. నిడదవోలు వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో యాత్రికులకు ఫలహారాలు అందచేశారు. ఏలూరుకు చెందిన స్వర్గీయ సిహెచ్ శివరామకృష్ణ జ్ఞాపకార్ధం వారి కుటుంబ సభ్యులు గోష్పాద క్షేత్రంలో యాత్రికులకు అన్నదానం చేశారు. జోనల్ ఫుడ్ కంట్రోలర్ ఎన్ పూర్ణచంద్రరావు, ఫుడ్ ఇన్స్‌పెక్టర్లు స్థానిక హోటళ్లను తనిఖీ చేశారు. రాష్ట్ర కాపు జెఎసి నాయకులు దాసరి రాము, ఒంగోలు జిల్లా జడ్జి టి సూర్యనారాయణ తదితరులు పుణ్యస్నానాలు ఆచరించారు.