S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మంత్రులను బర్తరఫ్ చేయాలి

మోర్తాడ్, జూలై 31: ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో సంబంధిత మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సుమీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. మోర్తాడ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులు ఐదు పర్యాయాలు ఎంసెట్ పరీక్ష రాశారని, మళ్లీ ప్రభుత్వ అసమర్ధత వల్ల మరోసారి పరీక్ష రాయమనడం సమంజసం కాదన్నారు. అక్రమాలకు పాల్పడిన వారి ర్యాంకులను రద్దు చేసి, చట్టపరంగా శిక్షించడంతో పాటు మిగతా విద్యార్థులకు యథావిధిగా కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రశ్నా పత్రాలు లీక్ అయిన సమయంలో పలువురు మంత్రులను బర్తరఫ్ చేయగా, చాలామంది నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారని ఆయన గుర్తు చేశారు. లీకేజీలో అసలు దోషులు బయటపడాలంటే ముఖ్యమంత్రి కెసిఆర్, ఈ కేసును సిబిఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్ధత వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీకి నైతికి బాధ్యత వహిస్తూ మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీల విసిల నియామకం విషయంలోనూ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిగిందని, ఇప్పటి వరకు కోర్టు 15సార్లు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తప్పుబట్టిందని ఆయన గుర్తు చేశారు. లక్ష ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను, లీకేజీల పేరిట విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడే హక్కు ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. మంత్రులను బర్తరఫ్ చేయకపోయినా, లీకేజీ దోషులను శిక్షించకున్నా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడ్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జగ్గు గంగాధర్, ఏర్పట్ల ఎంపిటిసి సున్నపు అంజయ్య పాల్గొన్నారు.