S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పట్టు వీడని సెకండ్ ఎఎన్‌ఎంలు

పిట్లం, జూలై 31: సమస్యల పరిష్కారం కోసం పట్టు విడవకుండా సెకండ్ ఎఎన్‌ఎంలు నిరవధిక ఆందోళనలు నిర్వహిస్తున్నా, ప్రభుత్వం స్పందించకపోవడంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా ఈ నెల 18వ తేదీ నుండి పిట్లం ప్రభుత్వాసుపత్రి ఎదుట పిట్లం, నిజాంసాగర్ మండలాలకు చెందిన సెకండ్ ఎఎన్‌ఎంలు తమ న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలని దీక్షలు కొనసాగిస్తున్నారు. వీరి ఆందోళన కారణంగా పిహెచ్‌సిలు, సబ్ సెంటర్లలో సేవలు మందగించి రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. అసలే వర్షాకాలం కావడంతో పల్లెల్లో ఎటు చూసినా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఆయా కార్యక్రమాల నిర్వహణ కోసం వచ్చే ఎమ్మెల్యే మొదలుకుని ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా, మండల స్థాయి అధికారులకు అనునిత్యం వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. రోజుకోరీతిలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నప్పటికీ, ప్రభుత్వం నుండి స్పందన కానరాకపోవడంతో ఆందోళనను మరింత ఉద్ధృతం చేయాలని ప్రణాళిక రూపొందించుకోవడంలో నిమగ్నమయ్యారు.