S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిండిన కోట్‌పల్లి ప్రాజెక్ట్

ధారూర్, జూలై 31: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కోట్‌పల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండింది. ప్రాజెక్టు నీటి సామర్ధ్యం 24 అడుగులు కాగా పూర్తిగా నిండి ఆదివారం అలుగు మీదుగా వాగులోకి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రైతులు, సందర్శకుల్లో సంతోషం వెల్లువెత్తుతోంది. రైతులు వరి పంట వేయడానికి సరిపడా నీరువస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రతి శనివారం, ఆదివారం కోట్‌పల్లి ప్రాజెక్టు పరిసర ప్రాంతాల అందాలను తిలకించడంతో పాటు ప్రాజెక్టులో బోటింగ్ చేస్తారు. ఆదివారం ప్రాజెక్టు పూర్తిగా నిండి అలుగుపై నుండి వరద నీరు పారడంతో సందర్శకులు అనందంతో బోటింగ్ చేస్తున్నారు.