S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చినుకు పడితే చిత్తడే!

హిందూపురం టౌన్, జూలై 31 : హిందూపురం కూరగాయల మార్కెట్‌లో చినుకు పడితే చాలు కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితి. మార్కెట్ ఆవరణ అంతా బురదమయంగా మారడంతో అటు వినియోగదారులు ఇటు వ్యాపారులు అనేక అగచాట్లకు లోనవుతున్నారు. గత ఏడాది క్రితం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో ఉన్న కూరగాయల మార్కెట్ శిథిలావస్థకు చేరుకుందని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కూలదోసిన విషయం తెలిసిందే. అయితే వెంటనే భవానాలు నిర్మించి వ్యాపారులకు కేటాయిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా దాదాపు రూ.100 కోట్లతో అన్ని హంగులతో మార్కెట్ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకొంటామన్నారు. అప్పటి దాకా స్థానిక రైతు బజార్‌లో తాత్కాలికంగా మార్కెట్‌ను నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల హామీలతో వ్యాపారులు రైతుబజార్‌లో వ్యాపారాలు నిర్వహించేందుకు సమ్మతించి చిన్నపాటి డేరాలు వేసుకుని వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారు. అయితే వర్షం వస్తే మార్కెట్ ఆవరణ బురదమయంగా మారడంతో వినియోగదారులు అనేక తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు దుర్గంధం వెదజల్లడం మరోవైపు బురదగా మారడంతో కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చిన్నారులను ఎత్తుకుని మార్కెట్‌కు వచ్చిన తల్లిదండ్రుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ఏమాత్రం అజాగ్రత్తగా కాలు మోపినా జారి బురదలోకి పడిపోవాల్సిందే. ఇదే పరిస్థితి ఆదివారం స్థానిక కూరగాయల మార్కెట్‌లో జరిగింది. గత నాలుగు రోజులుగా పట్టణంలో జడివాన పడటంతో మార్కెట్ ఆవరణ అంతా తీవ్ర బురదమయంగా తయారైంది. దీనికి తోడు మార్కెట్ వ్యర్థాలను అక్కడే పడవేయడం, ఆవులు, పందుల సంచారంతో మరింత దారుణంగా మారింది. దీంతో వర్షం వస్తే మార్కెట్‌కు వెళ్ళడమే వద్దులే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా నూతన మార్కెట్ నిర్మాణంలో అంచనాలు తారుమారయ్యాయి. రూ.100 కోట్లతో ప్రారంభమైన ప్రతిపాదనలు ప్రస్తుతం రూ.10 కోట్లకు దిగజారినట్లు తెలుస్తోంది. ఇటీవలే కొందరు వ్యాపారులు కోర్టును కూడా ఆశ్రయించి మార్కెట్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకొని నూతన మార్కెట్ నిర్మాణంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.