S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘హోదా’తోపాటు ప్యాకేజీ ఇవ్వాలి

హిందూపురం టౌన్, జూలై 31 : విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు అన్నిరంగాల్లో వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తర కోస్తాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో భాగంగా వామపక్ష పార్టీలు ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశంలో ఈనెల 2వ తేదీన రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. కావున వ్యాపారులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, కార్మికులు, అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు బంద్‌కు సహకరించి విజయవంతం చేయాలన్నారు. విభజన సమయంలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలో ఐదేళ్లు సరిపోదు, పదేళ్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరిన బిజెపి నేతలు ప్రస్తుతం పొంతనలేని విధంగా రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారన్నారు. అంతేగాకుండా కాంగ్రెస్ పార్టీ విభజన సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని బిల్లులో చేర్చకపోవడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితులు దాపురించాయన్నారు. టిడిపికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే అన్ని పార్టీలను కలుపుకుని ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని సూచించారు. ప్రధాని మోదీ అంటే టిడిపి నేతలకు భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందన్నారు. పరిశ్రమల కారిడార్ అంటూ టిడిపి నేతలు చెబుతున్నారని, అధికారం చేపట్టి రెండేళ్లు గడిచినా ఒక్క పరిశ్రమ రాలేదన్నారు. ఈ రెండేళ్లలో కనీసం ఎవరికైనా ఉద్యోగ అవకాశం కల్పించారా? అని ప్రశ్నించారు. కుదురేముఖ్, కడప, కర్నూలులో వివిధ రకాల ఖనిజ సంపద అపారంగా ఉన్నా పరిశ్రమల స్థాపన పేర ప్రకటనలు చేస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఎంతోమంది ఉన్నత చదువులు చదవుకున్న అభ్యర్థులు అతి తక్కువ వేతనాలతో వివిధ నగరాల్లో పనులు చేస్తున్నాయన్నారు. ఇకపోతే జిల్లాకు వర ప్రదాయినిగా ఉన్న హంద్రీనీవాను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల స్థాపనకు ఎలాంటి వౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదన్నారు. ప్రత్యేక హోదా వల్ల రాయితీలు రావడంతోపాటు అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయన్నారు. వీటిన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్న బంద్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంత చేయాలన్నారు. ఈ సమావేశంలో సిపిఐ తాలూకా కార్యదర్శి సురేష్‌బాబు, కౌన్సిలర్ దాదాపీర్, నాయకులు ప్రవీణ్‌కుమార్, రాము, నాయకులు కెటి శ్రీనివాసరెడ్డి, ఇబ్రహీం, మాబు, మారుతీ పాల్గొన్నారు.