S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బిజెపి మంత్రులను పదవుల నుంచి తొలగించాలి

కర్నూలు సిటీ, జూలై 31:రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న బిజెపి మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే పదవుల నుంచి తొలగించాలని డిసిసి అధ్యక్షుడు బివై.రామయ్య డిమాండ్ చేశారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై బిజెపి, టిడిపి కుంటిసాకులు చెబుతున్నాయని, సిఎం చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై వత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా గురించి లేదని బిజెపి ప్రకటించడం దారుణమన్నారు. నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ రాష్ట్ర విభజన చట్టం బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఏపికి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా, వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కేటాయిస్తున్నట్లు ప్రకటించగా ఐదేళ్లు సరిపోదని పదేళ్లు కావాలని వెంకయ్యనాయుడు డిమాండ్ చేసిన విషయాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించారు. కేంద్రంలో సంపూర్ణ మెజారిటీ ఉన్న బిజెపి ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి వాటికి ఆమోదం తెలపవచ్చని, కానీ మోదీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించటం లేదని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం సిఎం చంద్రబాబు బిజెపి నాయకులను తన మంత్రి వర్గం నుంచి తొలగించి, టిడిపి ఎంపిల చేత కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయించి మోదీ సర్కారుకు మద్దతును ఉప సంహరించుకోవాలని, లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నాయకులు సర్దార్ బుచ్చిబాబు, ఆకెపోగు వెంకటస్వామి, వేణుగోపాల్‌రెడ్డి, సలాం, పెద్దారెడ్డి పాల్గొన్నారు.