S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పుష్కరాలు విజయవంతం చేయాలి

కర్నూలు సిటీ, జూలై 31:కృష్ణా పుష్కరాలకు వచ్చే ప్రతి వ్యక్తిని అతిథిగా భావించి విధులను సక్రమంగా నిర్వహించి పుష్కరాలను దిగ్విజయంగా నిర్వహించాలని కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. కృష్ణా పుష్కరాల్లో విధులు నిర్వహించే అధికారులకు ఆదివారం హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రం అధికారులు ‘హౌ టు కంట్రోల్ క్రౌడ్’ అనే అంశంపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలను కర్నూలు, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలో సంగమేశ్వరం, శ్రీశైలంలో నిర్వహిస్తామన్నారు. అయితే సంగమేశ్వరం మారుమూల ప్రాంతమైనందున రహదారి సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో సిసి రోడ్లు ఏర్పాటు చేశామన్నారు. ఇక విద్యుత్, ఆర్‌డబ్ల్యుఎస్, రెవెన్యూ శాఖ అధికారులు పుష్కర భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ముఖ్యంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించి పుష్కరాలను విజయవంతం చేయాలన్నారు. అలాగే పాతాళగంగ, లింగాలగట్టులో పుణ్యస్నాణం చేయటానికి అన్ని వసతులు కల్పించామని, పాతాళగంగ వద్ద విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ యంత్రాంగంలోని ప్రతి శాఖ చైన్ లింక్ మాదిరిగా ఉండి పని చేయాలన్నారు. ప్రతి ఉద్యోగి వారి పూర్తి నైపుణ్యతను ఉపయోగించి విధులు నిర్వహించాలన్నారు. సమావేశంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రం అధికారిణి ప్రసన్నకుమారి, జాయింట్ కలెక్టర్ హరికిరణ్, డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, తదిరులు పాల్గొన్నారు.
కర్నూలు సిటీ, జూలై 31:కృష్ణా పుష్కరాలకు వచ్చే ప్రతి వ్యక్తిని అతిథిగా భావించి విధులను సక్రమంగా నిర్వహించి పుష్కరాలను దిగ్విజయంగా నిర్వహించాలని కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. కృష్ణా పుష్కరాల్లో విధులు నిర్వహించే అధికారులకు ఆదివారం హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రం అధికారులు ‘హౌ టు కంట్రోల్ క్రౌడ్’ అనే అంశంపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలను కర్నూలు, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలో సంగమేశ్వరం, శ్రీశైలంలో నిర్వహిస్తామన్నారు. అయితే సంగమేశ్వరం మారుమూల ప్రాంతమైనందున రహదారి సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో సిసి రోడ్లు ఏర్పాటు చేశామన్నారు. ఇక విద్యుత్, ఆర్‌డబ్ల్యుఎస్, రెవెన్యూ శాఖ అధికారులు పుష్కర భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ముఖ్యంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించి పుష్కరాలను విజయవంతం చేయాలన్నారు. అలాగే పాతాళగంగ, లింగాలగట్టులో పుణ్యస్నాణం చేయటానికి అన్ని వసతులు కల్పించామని, పాతాళగంగ వద్ద విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ యంత్రాంగంలోని ప్రతి శాఖ చైన్ లింక్ మాదిరిగా ఉండి పని చేయాలన్నారు. ప్రతి ఉద్యోగి వారి పూర్తి నైపుణ్యతను ఉపయోగించి విధులు నిర్వహించాలన్నారు. సమావేశంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రం అధికారిణి ప్రసన్నకుమారి, జాయింట్ కలెక్టర్ హరికిరణ్, డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్ పాల్గొన్నారు.