S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రత్యేక హోదా సాధనలో పాలకుల వైఫల్యం

వేదాయపాళెం, జూలై 31 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రితో సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు పూర్తిగా వైఫల్యం చెందారని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ సలహాదారుడు హెచ్‌ఎం. సుహాని విమర్శించారు. నగరంలోని స్థానిక విఆర్‌సి మైదానంలో ఆదివారం జరిగిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేకహోదాకు బిజెపి కట్టుబడి ఉందని సాక్షాత్తు వెంకటేశ్వరస్వామి పాదాల చెంతన చెప్పిన నరేంద్రమోదీ ఇప్పుడు మాట మారుస్తూ ప్రత్యేకహోదా ఇవ్వలేమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి 5 ఏళ్లు ప్రత్యేకహోదాను కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు ప్రత్యేకహోదా 10 సంవత్సరాల పాటు కావాలని చెప్పిన ఆయన కూడా మాట మారుస్తున్నారని మండిపడ్డారు. ఎప్పటికప్పుడు మాటలు మార్చే నాయకులకు ప్రజలే సరైన బుద్ధి చెబుతారన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన మాట ప్రకారం ఎపికి ప్రత్యేకహోదా ప్రకటించాలన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నేత ఎస్.గుప్తా మాట్లాడుతూ పార్టీని స్థాపించిన కొద్ది రోజుల్లోనే సామాన్యుడైన ఆప్ అధినేత కేజ్రీవాల్ మీద ఢిల్లీ ప్రజలకు ఉన్న నమ్మకంతో ముఖ్యమంత్రిని చేయడం జరిగిందన్నారు. ఢిల్లీ ప్రజలు ఆయన మీద ఉంచిన నమ్మకంతో ఆయన ఢిల్లీలో ఎనలేని రీతిలో అభివృద్ధి చేసి చూపించారన్నారు. అలాంటి వ్యక్తి స్థాపించిన పార్టీ మన రాష్ట్రంలో కూడా ప్రస్తుతం అభివృద్ధి చెందుతుందని, రానున్న ఎన్నికలలో రాష్ట్ర ప్రజలకు ప్రత్యామ్నాయ పార్టీగా రానుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అందరూ కలసికట్టుగా పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా వస్తేగాని ఏపి అభివృద్ధి చెందదన్నారు. కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు ప్రతిఒక్కరూ నడుం బిగించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేకహోదా సాధించుకోవాలన్నారు. ప్రత్యేకహోదా ఉద్యమానికి తమ వంతు సహకారం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆప్ రాష్ట్ర కో కన్వీనర్ పి.రామారావు, జిల్లా కన్వీనర్ షేక్.రియాజ్, రాష్ట్ర మహిళా నాయకురాలు బి.శారద, పశ్చిమగోదావరి జిల్లా కన్వీనర్ అధికార్, నగర కార్యదర్శి అనీల్, నాయకులు ఫణిరాజ్, చంద్రశేఖర్ ఆచారి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.