S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పూటకో మాట మారుస్తూ ఎపికి అన్యాయం చేస్తున్నారు

వేదాయపాళెం, జూలై 31 : కేంద్ర, రాష్ట్ర మంత్రులు పూటకో మాట మారుస్తూ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా విద్యార్థి జెఎసి జిల్లా కన్వీనర్ డి.అంజయ్య ఆధ్వర్యంలో నగరంలోని స్థానిక ఎన్జీఓ హోంలో ఆదివారం అన్ని విద్యార్థి సంఘాల నాయకులు, ఉద్యోగ, కుల సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అంజయ్య మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఒక పార్టీకి చెందిన ముఖ్యనేత పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర విభజన చేస్తే, మరో పార్టీకి చెందిన ముఖ్యనేత 10 సంవత్సరాలు ప్రత్యేకహోదా కావాలని డిమాండ్ చేశారన్నారు. కానీ వారిరువు నేతలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ఆంధ్రాకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపి అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా ఎంతో అవసరమన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు ప్రతిఒక్కరూ ప్రత్యేకహోదా కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని దీనిని సాధించుకునేందుకు అందరం నడుం బిగించాలన్నారు. ఆగస్టు 5వ తేదిన పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల్లో పెట్టనున్న ప్రత్యేకహోదా బిల్లుపై అన్ని రాజకీయపార్టీలు పార్టీలకు అతీతంగా మద్దతు పలకాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 2వ తేదిన ప్రత్యేక హోదా కోసం చేపడుతున్న రాష్ట్ర బంద్‌కు ఏపి ప్రత్యేకహోదా విద్యార్థి జెఏసి సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో లాయర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి, బిటిఎ జిల్లా అధ్యక్షుడు గడ్డం శేఖర్, సిఐటియు రూరల్ కార్యదర్శి అల్లాడి గోపాల్, మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పూర్ణా వెంకయ్య, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి ఫరూఖ్, ఎన్‌ఎస్‌యుఐ నగర అధ్యక్షుడు వంశీకృష్ణయాదవ్, వి.వెంకటరమణ, కె.శ్రీనివాసులు, ఎస్‌కె.అన్వర్‌బాషా, మురళీకృష్ణ యాదవ్, పి.నరసింహ, టి.మనోహర్, ఆదినారాయణ, పి.శంకరయ్య, కొప్పోలు చంద్రశేఖర్ పాల్గొన్నారు.