S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పేదలకు అండగా ఉండాలి

నెల్లూరుసిటీ, జూలై 31: ఆర్య వైశ్యులంతా చిన్న చిన్న మనస్పర్థలు పక్కన పెట్టి ఐక్యంగా ఉండాలని తమిళనాడు గవర్నర్ రోశయ్య పిలుపునిచ్చారు. ఆదివారం పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్టోన్‌హౌస్ పేటలోని ఎస్‌బిఎస్ కల్యాణ మండపం పక్కన నిర్మించిన ఆర్యవైశ్య భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అర్బన్ ఆర్యవైశ్య అధ్యక్షుడు, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాధ్ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా తమిళనాడు గవర్నర్ రోశయ్య మాట్లాడుతూ ఆర్థికంగా వెసులుబాటు లేని బలహీన వర్గాల వారిని ఆదుకునేందుకు వైశ్య సంఘం ముందుండాలన్నారు. వైశ్యులలో కొంతమంది భర్త, భార్య, పిల్లలు ఎంతో శ్రమ చేసినా పూట గడవని కుటుంబాలు అక్కడక్కడ ఉన్నాయని అన్నారు. అటువంటి వారిని వైశ్య సంఘం ఆదుకోవాలన్నారు. ఆర్థికంగా వెసులుబాటు కాని వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను కూడా అందుకోలేక పోతున్నారన్నారు. అటువంటి వారికి ఆర్యవైశ్య సంఘం అండగా ఉండి ఆదుకోవాలన్నారు. పేదరికంలో ఉన్న ఆర్యవైశ్యులు ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఏ కార్యాలయానికి వెళ్లినా మీకెందుకు అమ్మ లక్ష్మీపుత్రులు అని చెప్పడంతో వెనక్కి వస్తున్నారని అన్నారు. దీనివల్ల ఆర్థికంగా వెనుకబడిన వైశ్యులను ప్రభుత్వంతో సంబంధం లేకుండా వైశ్య సంఘాలు ఆదుకోవాలన్నారు. ప్రతి జిల్లాలో వైశ్య భవనాలు, వసతిగృహాలు నిర్మించి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అవసరమైన పనులు చేయించాలన్నారు. వైశ్య భవనాలు అలంకారప్రాయంగా ఉండకూడదని పది మందికి సహాయం చేసే విధంగా ఉండాలన్నారు. కొన్ని ప్రాంతాలలో వైశ్యులు పౌరుషాలకు పోయి కరపత్రాలను పంచి ఒకరికొకరు రోడ్డుకెక్కుతున్నారని అటువంటి సంస్కృతికి స్వస్తి చెప్పాలన్నారు. చాలామంది వేదిక దిగితే సంఘంపై అంత శ్రద్ధ చూపారని అన్నారు. దీనివల్ల సంఘం అభివృద్ధి చెందదన్నారు. సంఘంలో ఐక్యత ఉన్నప్పుడే ప్రతిఒక్కరు అభివృద్ధిలోకి వస్తారని తెలిపారు. నెల్లూరు జిల్లా పొట్టిశ్రీరాములు పుట్టి పెరిగిన జిల్లా అని దీనికి ఒక ప్రాముఖ్యత ఉందన్నారు. రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన పొట్టిశ్రీరాములు ఆశయాలకు అనుగుణంగా యువత నడవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తంగుటూరు రామకృష్ణ మాట్లాడుతూ ఎలాంటి రాజకీయాలకు, బంధుప్రీతికి తావులేకుండా ఆర్యవైశ్య భవన్‌కు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. కావలి మునిసిపల్ చైర్మన్ అలేఖ్య మాట్లాడుతూ వైశ్యులు పేదలపట్ల అంకితంభావం కలిగి వారికి సహాయం చేయాలన్నారు. వైశ్యులు ఐకమత్యంగా ఉండి ఒకరికొకరు అండగా నిలవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆర్యవైశ్య ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాన్ని అమలుచేసి వైశ్యులకు ఒక వేదికను అందించినందుకు అభినందించారు. డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాధ్ మాట్లాడుతూ వైశ్యులకు ఒక వేదిక ఉండాలనే ఉద్దేశ్యంతో తన సొంత నిధులతో వైశ్య భవన్‌ను నిర్మించినట్లు తెలిపారు. వైశ్యుల అభ్యున్నతి కోసం ఈ భవనం వేదికగా ఉపయోగపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు పబ్బిశెట్టి శ్రీనివాసులు, సరాబు సుబ్రహ్మణ్యం, చీతిరాల పద్మావతి, చలువాది ఉమారాణి, దుగ్గిశెట్టి సుధారాణి పాల్గొన్నారు.