S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు

ఉలవపాడు, జూలై 31: స్థానిక ప్రభుత్వ వైద్యశాల నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ శిలాఫలకం ఆవిష్కరించారు. తొలుత చాకిచర్ల నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ఉలవపాడులోని నూతన భవన నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభకు కందుకూరు శాసనసభ సభ్యులు పోతుల రామారావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ నీతికి, నిజాయితీకి మారుపేరని, ఆయన ఆధ్వర్యంలో ప్రతి చిన్న వైద్యశాలను గుర్తించి వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు. కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం మాట్లాడుతూ 1994 నుండి హాస్పటల్ ఉరుస్తుందని, వర్షాకాలం వస్తే లోనికి నీరు వచ్చి రోగులు, హాస్పటల్ సిబ్బంది ఇబ్బందిపడుతున్నారని, ఇప్పటివరకు ఎంతమంది నేతలు వచ్చినా వాగ్దానాలు చేయడం తప్ప కార్యరూపం దాల్చలేదని, ఇప్పటికి మంత్రి కామినేని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము జరగడం ఆనందంగా ఉందని తెలిపారు. జాతీయ రహదారికి దగ్గరగా ఉన్నందున ట్రామా సెంటరు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరమన్నారు. అనంతరం కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు మాట్లాడుతూ పూర్తి స్థాయి వైద్యులు, ఆధునిక పరికరాలతో మోడల్ హాస్పిటల్‌గా ఉలవపాడు జిహెచ్‌ని అభివృద్ధి చేయాలని కోరారు. జిల్లాలో టిబి కేసులు అక్కడక్కడా నమోదు అవుతున్నాయని, వాటి గురించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంతకు ముందు తల్లి, పిల్లల మరణాలు ఎక్కువగా ఉండేవని, 2015-2016లో రాష్ట్ర వ్యాప్తంగా మాతా శిశు మరణాలు తగ్గింనందుకు మన రాష్ట్రానికి అవార్డు వచ్చిందని తెలిపారు. ఎన్‌టిఆర్ వైద్యసేవ, ఎన్‌టిఆర్ వైద్య పరీక్షల గురించి వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పు అయిన వారికి 700రూపాయల విలువ గల బేబి కిట్‌ను ఉచితంగా అందజేస్తామని, అందులో పిల్లలకు కావలసిన స్వెటర్లు, దోమతెర ఉంటాయని తెలిపారు. 275 104 వాహనాలను సర్వీస్ చేసి జిల్లాకు 20 వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదెన్న, రాష్ట్ర బిజెపి నాయకులు బత్తిన నరసింహారావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ 2 ప్రకాష్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన కో ఆర్డినేటర్ దుర్గాప్రసాద్, ఆర్‌డివో మల్లికార్జున, జిల్లా వైద్య అధికారిణి యాస్మిన్, ఎమ్‌పిపి చిన్నమ్మి, జెడ్‌పిటిసి పద్మావతి, వైద్యాధికారిణి శోభారాణి, వైస్ ఎమ్‌పిపి గొత్తులబ్రహ్మయ్య, ఎఎంసి డైరెక్టర్ మల్లవరపు సుబ్బారెడ్డి, సర్పంచ్ గురజాల ప్రసాదరావు, వార్డు మెంబరు వేమూరి వెంకటేశ్వర్లు, స్థానిక తెలుగుదేశం పార్టీ అధికారులు, ఆరోగ్య సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు