S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నీరు-చెట్టులో రూ.10 కోట్ల కుంభకోణం

శ్రీకాకుళం(టౌన్), జూలై 31: జిల్లాలో నీరు-చెట్టు కార్యక్రమం పేరుతో కోట్లాది రూపాయల దుర్వినియోగం చాలదన్నట్లు మరో పది కోట్ల రూపాయలు రాష్ట్ర కార్మిక, ఉపాధి, యువజన సర్వీసుల శాఖ మంత్రి నియోజకవర్గానికి మంజూరు చేయించుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాషరావు విమర్శించారు. ఆదివారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల్లో ఇంజనీరింగ్ అధికారులు చేపట్టాల్సిన పనులకు ముందస్తు అంచనాలు తయారు చేయాల్సి ఉన్నప్పటికీ, అందుకు విరుద్ధంగా అంచనాలను తరువాత రూపొందిస్తాం, అనుమతులు ఇచ్చేయండి జిల్లా కలెక్టర్‌ను కోరడం తెలుగుతమ్ముళ్ల అత్యుత్సాహానికి నిదర్శనమన్నారు. నీరు విడిచిపెట్టారు, వర్షాలు కురుస్తున్నాయి, పనులు ఏ విధంగా చేపడతారని కలెక్టర్ అధికారులను నిలదీసినప్పటికీ మంత్రి వర్యుల అండతో కలెక్టర్‌కే మొండి సమాధానం చెప్పే స్థితికి అధికారులు వెళ్లారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ టెక్కలి నియోజకవర్గంలో లోతుగా పరిశీలన చేస్తే అవినీతి బయటపడే అవకాశం ఉందన్నారు. సమావేశంలో పి.విశే్వశ్వరరావు, గుడ్ల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.