S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అమ్మోనియం నైట్రేట్ పట్టివేత

ఎచ్చెర్ల, జూలై 31: పేలుడు పదార్థాలకు ముడి సరుకుగా వినియోగించే అమ్మోనియం నైట్రేట్‌తో విశాఖపట్నం నుండి ఝార్ఖండ్ వెళ్తున్న రెండు లారీలను పోలీసులు చిలకపాలెం వద్ద తనిఖీల్లో భాగంగా ఆదివారం పట్టుకున్నారు. అమ్మోనియం నైట్రేట్ కు గార్డు, జిపిఆర్‌ఎస్, ఫైర్ సిలిండర్ వంటి రక్షణ పరికరాలు ఏర్పాటు చేయని కారణంగా విశాఖపట్నం మర్రిపాలెం కు చెందిన బొద్దు రమణ, శ్రీకాకుళం గుజరాతిపేటకు చెందిన దుక్క శ్రీనులను అరెస్ట్ చేసినట్లు ఎస్ ఐ సందీప్‌కుమార్ తెలిపారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించడంతో సంబంధిత వాహనాల డ్రైవర్లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ వివరించారు.