S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రజాబంద్‌ను విజయవంతం చేయండి

శ్రీకాకుళం(రూరల్), జూలై 31: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ లెఫ్ట్ పార్టీలన్నీ సంయుక్తంగా ఆగస్టు 2న ప్రజాబంద్‌కు పిలుపునిచ్చామని దీనిని వ్యాపార వర్గాలు, ప్రజలు విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ కోరారు. క్రాంతి భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై చర్చ జరిగిందని అన్ని పార్టీలు మద్దతిచ్చాయని తెలియజేశారు. సి పి ఎం జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ప్రత్యేక హోదా అని అప్పటి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ దానిని చట్టం చేయలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అధికారంలోనికి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రకటించారని ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు కావస్తున్నా బిజేపి ప్రభుత్వం పిల్లి మొగ్గలు వేస్తుందన్నారు. బిజేపి మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం నోరు మెదపడం లేదని ఇది దురదృష్టకరమన్నారు. చంద్రబాబు వౌనాన్ని వీడాలన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యవర్గసభ్యులు చౌదరి తేజేశ్వరరావు మాట్లాడుతూ లెఫ్ట్ పార్టీలు ఇచ్చిన బంద్‌కు వ్యాపార వర్గాలు సహకరించాలన్నారు. బంద్ విజయవంతమయితే కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వీలుంటుందన్నారు. ఈసమావేశంలో జి.నర్శునాయుడు పాల్గొన్నారు.