S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సిపిఎస్ రద్దు కోరుతూ కోటి సంతకాల సేకరణ

శ్రీకాకుళం(రూరల్), జూలై 31: యూటిఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఎస్టీఎఫ్‌ఐ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని స్థానిక రైతుబజార్ ఆవరణలో ఆదివారం శ్రీకాకుళం జెఏసి నాయకులు హనుమంతుసాయిరాం, ఆర్‌విఎన్ శర్మలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అమలు చేసి 15 ఏళ్లు పూర్తయ్యిందని వాటి వలన పెన్షన్, కుటుంబ పెన్షన్, గ్రాడ్యూటీ, కమ్యూటేషన్, పిఎఫ్ సౌకర్యం రద్దు చేశారని పేర్కొన్నారు. 2004 సెప్టెంబర్ 1 నుండి రాష్ట్రంలో సిపి ఎస్ విధానం అమలు చేసి ఉద్యోగ ఉపాధ్యాయులకు సామాజిక బాధ్యతగా చెల్లించాల్సిన పెన్షన్ చెల్లింపులు నుండి ప్రభుత్వాలు తప్పుకొని ఉద్యోగులు చెల్లించే సొమ్ము సైతం షేర్‌మార్కెట్‌లో పెట్టి కార్పొరేట్ వర్గాల వ్యాపార ప్రయోజనాలకు ఉద్యోగుల జీవితాలను బలి చేశారన్నారు. రాష్ట్రంలో 94వేల మంది టీచర్లు, 70వేలమంది ఉద్యోగులు దేశవ్యాప్తంగా 46,83,792 మంది సీపి ఎస్ పథకంలో ఉన్నారని వారు చెల్లించే వేలకోట్ల రూపాయలు కార్పొరేట్ ప్రయోజనాలకు పెట్టుబడిగా పెడుతున్నారని తెలియజేశారు. పాతపెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని యూ టిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చౌదరి రవీంద్ర, జిల్లా అధ్యక్షులు రెడ్డి మోహనరావు, జిల్లా సహాధ్యక్షుడు బమ్మిడి శ్రీరామమూర్తి, వై. ఉమాశంకర్, కె వి శ్రీరామమూర్తి, కె వి ఎం సత్యన్నారాయణ , ఎస్ తిరుపతిరావు, భాస్కర్‌ పాల్గొన్నారు.