S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అంతుచిక్కని అవినీతి ధార !

శ్రీకాకుళం: అన్నదాతలకు సాగునీరు అందించే వంశధార ప్రాజెక్టులో అవినీతి‘్ధర’ అంతుచిక్కడం లేదు. మొన్న వందకోట్ల షట్టర్ల కుంభకోణం.. నిన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో 134 కోట్లలకు లెక్కలే లేని దుస్థితి.. నేడు - తెలుగుతమ్ముళ్ళు రూ. తొమ్మిది కోట్లు బినామీ పేర్లుతో బుక్కేసిన వైనం. ఇలా.. అన్నదాత కోసం ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధుల్లో వేలాది కోట్ల రూపాయలు దళారులు మింగేశారు. దీనిపై తాజాగా ముఖ్యమంత్రి ఇంటలిజెన్స్‌శాఖకు నివేదికలు కోరినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో దుగ్గిపురం నిర్వాసిత కాలనీలో బినామీ కొండను ఆరు బృందాలుగా ఇంటెలిజెన్స్‌శాఖ మూడు రోజులుగా తవ్వుతున్నారు. తొమ్మిది కోట్ల రూపాయల బినామీల పేర్లతో ఫలహారం చేసిన వైనం వెనుక.. రూ. 42 కోట్ల రూపాయల మూటలు కొంతమంది టిడిపి నేతలు సర్దుకునే వ్యూహానికి మూలాలు దొరికినట్టు ఆ శాఖలో కొందరు చెప్పుకురావడం గమనార్హం. విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఇంటెలిజెన్స్ బృందాలు అక్రమార్కుల జాబితాతోపాటు, వారి వెనుదన్నుగా ఉన్న రాజకీయ నేతల వివరాలు సేకరణలో నిమగ్నమై ఉన్నట్టు సమాచారం.
నిర్వాసితులకు దక్కాల్సిన ప్యాకేజీలను బినామీ పేర్లతో రాజకీయ నేతలు, బ్రోకర్లు అడ్డంగా దోచేసుకుంటున్నారన్న వాస్తవాలు వెలుగుచూడడంతో ఆ శాఖ అధికారులే ఉలిక్కిపడుతున్నారు. మధ్యవర్తులుగా, దళారులుగా తెలుగుతమ్ముళ్ళే వ్యవహారిస్తున్నారంటూ కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రత్యేకంగా లేఖ పంపారు. దీంతో ఇంటెలిజెన్స్ నివేదికలు సిఎం కోరినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఇంటెలిజెన్స్ అధికారులు సేకరించిన సమాచారం మేరకు సుమారు తొమ్మిది కోట్ల రూపాయలు కాకిలెక్కలతో దళారులు స్వాహా చేసినట్టు తెలుస్తోంది. వంశధార నిర్వాసిత గ్రామమైన దుగ్గుపురంలో బినామీలు బరితెగించినట్లు ఇంటెలిజెన్స్‌శాఖ కనుగొంది. ఇక్కడ ముందుగానే స్థలం కొనుగోలు చేసి తమ పలుకుబడితో ఇల్లు ఉన్నట్లు రికార్డు చేయించారు. వాస్తవానికి నిర్వాసితుల ఇల్లు, పశువుల పాకలు, ఇతర స్థలాలకు ప్రభుత్వం కొంత ధర నిర్ణయించింది. ఇక్కడే దళారులు ముసుగులో ‘తమ్ముళ్ళు’ కొంతమంది అవినీతికి తెరలేపారని, బినామీల పేరిట ఇక్కడ హడావుడిగా రేకుల షెడ్ల వంటి నిర్మాణాలు చేపట్టారని, వాటినే పటిష్ఠమైన పక్కా ఇల్లుగా చూపి ఎక్కువ ధర వచ్చేలా ఏర్పాటు చేసుకున్నట్టు ఆ నివేదికలో ఉన్నట్టు తెలిసింది. కేవలం పరిహారం కోసం దళారులు నిర్మించిన రేకుల షెడ్లకు 20 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకూ ధరను నిర్ణయించారు అధికారులు. అయితే, అసలైన నిర్వాసితుల ఇళ్లకు మాత్రం 20 వేల నుంచి రెండు లక్షల రూపాయలు మాత్రమే ధర నిర్ణయించారు. ఇటువంటి అవినీతిపై గ్రామస్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. అక్కడ ఎమ్మెల్యే నిర్వాసితులకు అండగానిలవలేదంటూ ఆరోపిస్తున్నారు. చివరకు నిర్వాసితుల గోడు మావోనేతల వరకూ చేరడంతో వారు దళారులతోపాటు, ప్రజాప్రతినిధులకు హెచ్చరికలు చేయడం గమనార్హం!
ఇదిలా ఉండగా, ఇటీవల యూత్‌ప్యాకేజీ, ఇతర పరిహారాలంటూ నిర్వాసితుల కోసం ముఖ్యమంత్రి మంజూరు చేసిన రూ.421 కోట్ల రూపాయల్లో సుమారు 42 కోట్ల రూపాయలు చేతులుమారేవిధంగా దుగ్గుపురం నుంచే వ్యూహం రచించినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు పసిగట్టినట్టు సమాచారం. అయితే - ఈ వ్యూహం వెనుక గల పెద్దలు, పిన్నలు తెలిసినతర్వాత వారిపై నివేదికలు ముఖ్యమంత్రికి పంపేందుకు ఇంటెలిజెన్స్‌శాఖ బృందాలు తర్జనభర్జన పడుతున్న నేపథ్యంలో మావోనేల హెచ్చరికల సంగతి సిఎంకు చేరడంతోపాటు, సాక్షాత్తు కలెక్టరే వంశధార నిధులు దుర్వినియోగం అవుతున్నట్టు సమాచారం ఇవ్వడం వంటి సంఘటనల వల్ల అవినీతి వ్యక్తులపై చర్యలకు పట్టుబిగుస్తోంది. వీటిపై ముఖ్యమంత్రి తన పార్టీ వ్యక్తులపై చర్యలు తీసుకుంటారా? లేదా అన్న విషయం త్వరలోనే తేలనుంది.