S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కొట్టుకుపోయిన డైవర్షన్ రోడ్డు

కోటవురట్ల, జూలై 31: నర్సీపట్నం - రేవుపోలవరం అర్.అండ్.బి. రహదారిలో జల్లూరు వద్ద వరాహానదిపై 37 లక్షల రూపాయలతో నిర్మించిన డైవర్షన్ రోడ్డు రెండో సారి కొట్టుకుపోవడంతో పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత అర్. అండ్.బి. అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మండలంలో ఎండపల్లి గ్రామానికి ఒక ప్రైవేట్‌కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేకు మండల టిడిపి అధ్యక్షుడు కాశీనాయుడు డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయిన విషయాన్ని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. శనివారం రాత్రి కొట్టుకుపోయిన డైవర్షన్ రోడ్డు వలన రాకపోకలు నిలిచిపోయినట్లు ఆయన తెలిపారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఆర్.అండ్.బి. డి.ఇ. కేశవరావును, ఎ.ఇ.సాగర్‌ను కొట్టుకపోయిన డైవర్షన్ రోడ్డు వద్దకు రప్పించారు. ఆర్. అండ్.బి. అధికారుల నిర్లక్ష్యం వలనే ఈవిధంగా జరిగిందని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి సారి కొట్టుకుపోయినప్పటికీ కాంట్రాక్టర్‌ను, ఎ.ఇ.ను హెచ్చరించడం జరిగిందన్నారు. అయినా రెండవ సారి అధికారులు నిర్లక్ష్యం వహించడం వలనే డైవర్షన్‌రోడ్డు మళ్ళీ కొట్టుకుపోయిందన్నారు. తాను నిర్వహించే సమీక్షా సమావేశాలకు అర్.అండ్.బి. అధికారులు డుమ్మాకొడుతున్నారన్నారు. డైవర్షన్ రోడ్డు మరమ్మతు పనుల్లో అర్.అండ్.బి. అధికారుల పర్యవేక్షణ లోపించిందన్నారు. తక్షణం మరమ్మతులు చేపట్టి వాహనాల రాకపోకలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ఈసారి సిమెంట్, కాంక్రీట్‌తో పటిష్టంగా నిర్మించాలని సూచించారు. దీనిపై ఆర్.అండ్.బి. డిఇ మాట్లాడుతూ సిమెంట్ కాంక్రీట్‌తో పటిష్టంగా నిర్మించేందుకు 67 లక్షల రూపాయలు అవుతుందని తెలిపారు. తక్షణం ప్రతిపాదనలు పంపిస్తే మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట మండల టిడిపి అధ్యక్షుడు కాశీనాయుడు, ఎస్.రాయవరం మండల అధ్యక్షుడు వినోద్‌రాజు, అర్.అండ్.బి. ఎ.ఇ. సాగర్‌లు ఉన్నారు.