S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సిసి రోడ్ల నిర్మాణానికి రూ.3 కోట్లు!

కశింకోట, జూలై 31: రాష్ట్రంలో మూడువేల కోట్ల రూపాయలతో 4,500 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లను నిర్మించామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. మండల కేంద్రమైన కశింకోటలో ఎంపిపి పెంటకోట సుబ్బలక్ష్మీ అధ్యక్షతన ఆదివారం జరిగిన ఈ సమావేశంలో మంత్రి అయ్యన్న మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినప్పటికీ ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారన్నారు. 1986లో నేను కశింకోటలో మంచినీటి పథకానికి శంకుస్థాపన చేసిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయన్నారు. కశింకోటతో పాటు సమీప మండలాల్లో ఉన్న 155 గ్రామాలకు తాగునీరు అందించాలనే ధ్యేయంతో 36కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రూ. 643 కోట్లతో శ్మశాన వాటికలు, సిసిరోడ్లు నిర్మాణాలు, ఫుట్‌పాత్ బ్రిడ్జీలు, కల్యాణ మండపాలు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. 15లక్షలతో పంచాయతీ బిల్డింగ్‌లు మండలంలో నిర్మిస్తున్నామన్నారు. 150 శ్మశానవాటికలకు 10లక్షలు చొప్పున నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. రూ.1.20కోట్లతో మండల కార్యాలయానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. హుదూద్ తుపానులో నియోజకవర్గంలో తొమ్మిది కోట్లు మంజూరు చేశామన్నారు. ఇప్పటికి రూ. 37కోట్లు నియోజకవర్గం అభివృద్ధికి మంజూరు చేశామన్నారు. ముఖ్యంగా ఇక్కడి రైతులు ఇబ్బందులు పడకుండా 2.80కోట్లుతో ఫుట్‌పాత్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పీలాగోవిందసత్యనారాయణ కశింకోటలో పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మంత్రి పైవిధంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి మలసాల ధనమ్మ, విశాఖ డెయిరీ డైరక్టర్ మలసాల రమణారావు, ఎంపి అవంతి సోదరుడు మహేష్, ఎంపిటిసి పంచదార్ల లక్ష్మీ, నిమ్మదల త్రినాధరావు, టిడిపి నాయకులు వేగి గోపికృష్ణ, యువ నాయకులు మళ్ల లోవకృష్ణ, కొంతం ఆదినారాయణ, డిసిసిబి డైరక్టర్ శిదిరెడ్డి శ్రీను, పెంటకోట రాము, పెంటకోట సత్యనారాయణ, వేగి వెంకట్రావు, ఆడారి నరశింగరావు పాల్గొన్నారు.