S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వైఎస్ విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలి

విజయవాడ, జూలై 31: రోడ్లు విస్తరణ పేరిట అర్ధరాత్రి వేళ దారుణాతి దారుణంగా తొలగించబడిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాంశ్య విగ్రహాన్ని తొలగించిన ప్రదేశంలోనే యథావిథిగా పునః ప్రతిష్ఠించాలని కోరుతూ వైఎస్సార్సీ ఆధ్వర్యంలో ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వరకు శాంతి ర్యాలీ జరిగింది. అనంతరం కలెక్టర్ బాబు ఎకి వినతిపత్రం అందించారు. వైఎస్ విగ్రహాన్ని కూల్చడంపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. వాస్తవానికి ఈ విగ్రహం వలన ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేదన్నారు. అన్ని రకాల అనుమతులతోనే విగ్రహాన్ని ప్రతిష్ఠ జరిగిందన్నారు. విగ్రహాన్ని పునః ప్రతిష్ఠ అనుమతివ్వాలని కోరగా పరిశీలిస్తానంటూ కలెక్టర్ హామీనిచ్చినట్లు నేతలు తెలిపారు. ఈ ర్యాలీకి జిల్లా, నగర అధ్యక్షులు కె పార్థసారథి, వంగవీటి రాధాకృష్ణ, శాసనసభ్యులు మేకా ప్రతాప్ అప్పారావు, ఉప్పులేటి కల్పన, రక్షణనిధి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, కార్పొరేటర్ బొప్పన భవకుమార్, బిసి నేత ఎరుకుల కాశీపతి పాల్గొన్నారు.