S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శాశ్వత పర్యాటక కేంద్రంగా పవిత్ర సంగమం ప్రాంతం

ఇబ్రహీంపట్నం, జూలై 31: పవిత్ర సంగమ ప్రాంతాన్ని శాశ్వత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దిడం జరుగుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం ప్రాంతంలో రూ. 5.50 కోట్లతో అభివృద్ధి చేసిన 20 ఐమాస్ట్ లైట్లను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పవిత్ర సంగమం ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఇందులో భాగంగా పుష్కరాల నేపథ్యంలో అన్ని విధాలుగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. ఈ సంగమ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఒక్కొక్క ఐమాస్ట్ లైట్లు 50 మీటర్ల పరిధి వరకు కాంతులు వెదజల్లుతాయన్నారు. పుష్కరాల నేపథ్యంలో ఏడు పంట్లపై హారతి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇరిగేషన్ సంబంధం అంశాలు, నీటి సంరక్షణ చర్యలు వంటి సామాజిక అంశాల ప్రతిపాదికపై శాశ్వత విజ్ఞాన ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా రైతులు, విద్యార్థులు ఆయా అంశాలపై పూర్తి అవగాహన పొందుటకు అద్భుత వేదికగా నిలుస్తుందని మంత్రి అన్నారు. అంతకు ముందు మంత్రి దుర్గాఘాట్‌ను సందర్శించి దుర్గా పైవంతెన దిగువ రహదారి పనులను పరిశీలించారు. రోడ్డు నిర్మాణానికి ప్రికాస్టు చేసిన గడ్డర్లను మంత్రి పరిశీలించి, పనులు త్వరితంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాబు ఎకు సూచించారు. మంత్రి వెంట నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, మున్సిపల్ కమిషనర్ జి వీరపాండియన్, ఇరిగేషన్ సిఇ వైఎస్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.