S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

యాత్రికులకు ఇబ్బందులు రానివ్వకండి

అవనిగడ్డ, జూలై 31: పుష్కర యాత్రికులకు 12 రోజులు పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టటంలో భాగంగా దివి సబ్ డివిజన్‌లో 2వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తామని ఎస్పీ విజయ్‌కుమార్ తెలిపారు. ఆదివారం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ సిసి కెమెరాల ఏర్పాటుతో పాటు రిజర్వ్ ఫోర్స్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు. 800 మంది విద్యార్థులతో పాటు ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సిసి వలంటీర్లు యాత్రికులకు సహకరిస్తారన్నారు. జిల్లావ్యాప్తంగా 136 ప్రైవేటు పార్కింగ్ ప్రదేశాలు గుర్తించగా సాగరసంగమంలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ నుండి సాగరసంగమానికి 20 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతారన్నారు. యాత్రీకులకు ఇబ్బంది లేకుండా అన్ని పుష్కర ఘాట్లను అనుసంధానం చేస్తూ అవనిగడ్డ, నందిగామలో పోలీసు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజయవాడలో మాస్టర్ కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని, చెన్నై, విశాఖ, హైదరాబాద్ నుండి వచ్చి వెళ్ళే వాహనాలను విజయవాడ నుంచికాక అనుబంధ మార్గాల ద్వారా దారి మళ్ళించనున్నట్లు తెలిపారు. అంతకుముందు డిఎస్పీ కార్యాలయం ఆవరణలో నిర్మాణంలో ఉన్న కంట్రోల్ రూమ్ పనులను ఆయన పరిశీలించారు. డిఎస్పీ సయ్యద్ ఖాదర్ బాషా, సిఐ మూర్తి, ఎస్‌ఐలు పాల్గొన్నారు.