S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కొల్లేరులో యథేచ్ఛగా తవ్వకాలు

మండవల్లి, జూలై 31: కొల్లేరులోని అభయారణ్యంలో నిబంధలకు విరుద్ధంగా అక్రమ చెరువుల తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన అటవీ శాఖ సిబ్బందిపై గ్రామస్తులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. సుప్రీం కోర్టు సాధికార కమిటీ తీర్పు, 120 జీవోను ధిక్కరిస్తూ ధ్వంసం చేసిన చెరువులను మరలా పునరుద్ధరిస్తున్నారు. మండలంలోని దెయ్యంపాడు, కొల్లేరు అభయారణ్య భూముల్లో శనివారం గ్రామస్తులు సుమారు 30 ఎకరాల చెరువు తవ్వకం పనులు చేపట్టారు. అక్రమ తవ్వకం పనులను నిరోధించటానికి వెళ్లిన అటవీ శాఖ సిబ్బందిని నాయకుల ప్రోద్బలంతో గ్రామంలోకి రాకుండా మహిళలు అడ్డుకున్నారు. దీనిపై అటవీ శాఖ సెక్షన్ అధికారి గంగారత్నం 14 మంది గ్రామస్తులపై ఫిర్యాదు చేసి పొక్లెయిన్‌ను స్వాధీనం చేసుకోటానికి ఆదివారం మధ్యాహ్నం సిబ్బందితో వెళ్లారు. సిబ్బందికి, గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవటంతో సెక్షన్ అధికారి గంగారత్నంను సిబ్బందిని నానావిధాలా దుర్భాషలాడుతూ దాడి చేసి కొట్టారు. ఈ దాడులను చిత్రీకరిస్తున్న కొందరు మీడియా ప్రతినిధులను అడ్డుకుని వారిని తోసేశారు. అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నా దెయ్యంపాడు సెంటర్‌లో ఉన్న పోలీసు సిబ్బంది ఏమీచేయలేక చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఇదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా కొల్లేరు అభయారణ్యంలో అక్రమ తవ్వకాలు కొనసాగితే డెల్టా ప్రాంతం ముంపునకు గురయ్యే ప్రమాదముందని, కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన కొల్లేరు ఆపరేషన్‌కు ప్రయోజనం ఉండదని పలువురు అంటున్నారు.