S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జాడలేని పుష్కరఘాట్ల అభివృద్ధి!

తోట్లవల్లూరు, జూలై 31: తోట్లవల్లూరు మండలంలో పుష్కరఘాట్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా వుంది. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకొని మండలంలో తొమ్మిది ఘాట్లను గుర్తించారు. వీటిలో ఏడు సి గ్రేడ్ ఘాట్‌లుగా రొయ్యూరు, వల్లూరుపాలెం, తోట్లవల్లూరులో రెండు, ఐలూరులో మూడు ఘాట్లను చేర్చారు. రెండు లోకల్ ఘాట్లుగా దేవరపల్లి, చాగంటిపాడులను నిర్ధారించారు. అయితే ఇంతవరకు ఒక్క పుష్కరఘాట్ అభివృద్ధి పనులూ చేపట్టలేదు. రొయ్యూరు పాత ఘాట్ నదీపాయలోకి కొట్టుకుపోవటంతో కొత్త ఘాట్ నిర్మాణానికి రూ.13 లక్షలు కేటాయించారు. కానీ టెండర్లు ఎవరూ వేయక పనులు చేపట్టలేదని అధికారులు చెపుతున్నారు. ఐలూరులో ఒక ఘాట్‌ని రూ.9.35 లక్షలతో పునర్నిర్మించాల్సి ఉండగా ఇక్కడ పనులు చేపట్టలేదు. వల్లూరుపాలెం ఘాట్‌కి రూ.91 వేలు, తోట్లవల్లూరు ఘాట్-1కి 1.52 లక్షలు, రెండో ఘాట్‌కి రూ.1.20 లక్ష లు, చాగంటిపాడు ఘాట్‌కి రూ.1.16 లక్షలు, దేవరపల్లి ఘాట్‌కి రూ.88వేలు, ఐలూరు ఘాట్-1కి రూ.9.35 లక్షలు, రెండో ఘాట్‌కి రూ.1.25 లక్షలు, మూడో ఘాట్‌కి రూ.1.23 లక్షలు కేటాయించారు. ఎవరూ టెండర్లు వేయలేదని ఘాట్ల అభివృద్ధి పనులు చేపట్టలేదు. అయితే వల్లూరుపాలెం, తోట్లవల్లూరు, చాగంటిపాడు, దేవరపల్లి, ఐలూరు గ్రామాల్లోని ఘాట్లకు అప్రోచ్ రోడ్లు నిర్మించారు. జిల్లాలో విజయవాడ తర్వాత తోట్లవల్లూరు మండలంలో ఘాట్లు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడు పుష్కరాలు వచ్చినా మండలంలోని అన్ని ఘాట్లకు భక్తులు వచ్చి స్నానాలు చేసి ఆ గ్రామాల్లోని ఆలయాల్లో స్వామివార్లను దర్శించుకుని వెళుతుంటారు. కానీ ఈసారి పుష్కరాలకు మండలంలోని ఘాట్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, నిధులు కూడా మంజూరు చేశామని ప్రకటించి తీరా పుష్కరాలు దగ్గర పడటంతో అధికారులు టెండర్లు పిలిచామని, నిర్మాణాలు చేపట్టటానికి ఎవరూ ముందుకు రావటం లేదని చెపుతున్నారు. తోట్లవల్లూరు మండలం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పరిధిలో వుండటం, జెడ్పీటిసి, ఎంపిపి కూడా వైసిపి వారే కావటం, సర్పంచ్‌లు కూడా ఎక్కువ శాతం ఆ పార్టీవారే కావటంతో ప్రభుత్వం వివక్ష చూపుతూ అభివృద్ధి పనులు చేపట్టటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.