S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ముక్త్యాలలో పుష్కర పనులు వేగవంతం

జగ్గయ్యపేట రూరల్, జూలై 31: పత్రికల్లో వచ్చిన కథనాలు జిల్లా కలెక్టర్ బాబు ఎ స్వయంగా పరిశీలించి పనులు నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో మండలంలోని ముక్త్యాల గ్రామంలో పుష్కర నిర్మాణాలు, ఇతర పనులు వేగవంతం అయ్యాయి. ఇప్పటి వరకూ మొక్కుబడిగా పరిశీలన చేసి వెళ్లిన వివిధ శాఖల ఉన్నతాధికారులు గ్రామంలోనే మకాం పెట్టి దగ్గర ఉండి పనులు చేయిస్తున్నారు. ముక్త్యాల రహదారిలో గల చంద్రమ్మ కయ్య పుష్కరాల నాటికి పూర్తి అయ్యేనా అంశంతో ఆంధ్రభూమిలో ఫోటోలతో సహా కధానాలు రావడం, జిల్లా కలెక్టర్ సైతం ముక్త్యాల పర్యటనలో ప్రధానంగా ఈ అంశంపై ఆర్ అండ్ బి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపధ్యంలో ఎక్కువ మంది కూలీలను పెట్టి ఆర్ అండ్ బి అధికారులు, కాంట్రాక్టర్ దగ్గర ఉండి యుద్దప్రాతిపదికన పనులు జరిగేలా చూస్తున్నారు. అదే మార్గంలో మరి కొన్ని వంతెనల నిర్మాణ పనులు కూడా ఊపందుకున్నాయి. కలెక్టర్ ఆదేశాలతో ముక్త్యాల గ్రామంలోని కృష్ణా నది ఒడ్డున పేరుకుపోయిన కంప చెట్లను ప్రొక్లైయిన్‌తో తొలగించి చదును చేసే కార్యక్రమాన్ని కాంట్రాక్టర్ చేపట్టారు. విశాలంగా నిర్మించిన భవానీ ముక్తేశ్వరస్వామి నూతన ఘాట్‌లలో టైల్స్ ఏర్పాటు పెద్ద ఎత్తున జరుగుతొంది. రెండు రోజుల క్రితం వరకూ అపరిష్కృతంగా ఉన్న పుష్కర ఘాట్‌కు భక్తులు తరలివచ్చే మార్గంపై నిర్ణయం జరగడంతో యంత్రాలను ఏర్పాటు చేసి పనులు నిర్వహణ వేగవంతంగా చేస్తున్నారు. ఈ మార్గం ఏర్పాటు చేసే బాధ్యత కెసిపి సిమెంట్ సంస్థ తీసుకొని వారే స్వయంగా పనులు జరిపిస్తున్నారు. నదీ గర్భంలోని శివాలయం ముందు భాగం కృష్ణానది వరకూ 8మీటర్ల మేర కాంక్రీట్ గోడ, మెట్ల నిర్మాణాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు దగ్గర ఉండి పనులు ప్రారంభించి ఎప్పటికప్పుడు నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేస్తున్నారు. ఘాట్‌ల పై వరకూ దాదాపు ఫ్లాట్ ఫారాలు, మెట్ల నిర్మాణాలు జరగడంతో నది వద్ద నిర్మాణాలు కొత్తగా కలెక్టర్ నిర్ణయించడం వల్ల అక్కడికి ఇసుక, కంకర వంటి మెటీరియల్ సరఫరా చేసే వాహనాలతో పాటు పనుల నిర్వహణకు అవసరమైన యంత్రాలు రావడానికి కొత్తగా ర్యాంప్ నిర్మించాల్సి రావడంతో కొంత ఇబ్బందులు తలెత్తాయి. పోలీస్ అధికారులు పుష్కర ఘాట్‌ల పరిశీలన కోసం పెద్ద ఎత్తున సిసి కెమెరాలు, వైఫై ఏర్పాటు చేస్తున్నారు. పుష్కర ఘాట్ ఇన్‌చార్జి ఎఎస్‌పి చంద్రశేఖర్ దగ్గర ఉండి పనులు పరిశీలిస్తున్నారు. ఇంకా పుష్కరాలకు పది రోజులు మాత్రమే గడువు ఉండటంతో అధికార యంత్రాంగం బిజీ బిజీగా ఉంది.